TG Jobs: సింగరేణిలో ఉద్యోగాలు..ఇక లైఫ్ సెటిల్ అయినట్లే! కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ...వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకునోటిఫికేషన్ విడుదల అయ్యింది. By Bhavana 13 Jun 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TG Jobs; కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ...వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకునోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. జూన్ 29వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://scclmines.com/ వెబ్‌సైట్ లో చూడవచ్చు. మొత్తం పోస్టుల వివరాలు - 327 ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు మేనేజ్‌మెంట్ ట్రైనీ , ఇ2 గ్రేడ్: 42 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ , ఇ2 గ్రేడ్: 07 పోస్టులు. నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ , టి అండ్ ఎస్ గ్రేడ్-సి: 100 పోస్టులు అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ , టి అండ్ ఎస్ గ్రేడ్-సి: 09 పోస్టులు అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ , టి అండ్ ఎస్ గ్రేడ్-సి: 24 పోస్టులు ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47 పోస్టులు ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. Also read: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు #jobs #kottagudem #singareni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి