Airlines: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 8 నెలల జీతం బోనస్!

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ 8 నెలల జీతం బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2023- 24లో ఎయిర్‌లైన్‌ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపింది.

New Update
Airlines: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 8 నెలల జీతం బోనస్!

Singapore Airlines Announces 8 months Salary Bonus: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (Singapore Airlines) సంచలన నిర్ణయం తీసుకుంది. అంచనాలకు మించి లాభాలు రావడంతో తమ సిబ్బందికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగులందరికీ 8 నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్ తర్వాత చైనా, హాంకాంగ్‌, జపాన్‌, తైవాన్‌ దేశాల బార్దర్లు తెరచుకోవడంతో తమ సంస్థ లాభాల బాట పట్టిందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Triple Talaq: వాట్సప్ లో త్రిపుల్ తలాక్.. భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన భార్య!

2023- 24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.98 బిలియన్‌ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేయగా.. మార్చి ముగిసే సమయానికి ఎయిర్‌లైన్‌ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపారు. ఇక ప్యాసింజర్లకు మెరుగైన ప్రయాణ వసతులు కల్పించడంతో పాటు తమ ఉద్యోగుల పనితీరే ఈ వృద్ధికి కారణమని పేర్కొన్నారు. గతేడాది సింగపూర్ ఎయిర్ లైన్స్ 36.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు తెలిపింది. ఇక గతంలో దుబాయ్‌ ఎమిరేట్స్‌ కూడా ఇలానే 20 వారాల జీతాన్ని ఉద్యోగులకు బోనస్‌గా అందించింది.

Advertisment
తాజా కథనాలు