Buckets : బాత్ రూమ్ బకెట్స్ పై జిడ్డు మరకలను ఇలా తొలగించండి సాధారణంగా ఇంట్లో బాత్ రూమ్ లోని బకెట్లు, ముగ్గుల పై మరకలు మొండిగా మారతాయి. వాటిని తొలగించడానికి డిటర్జెంట్ ఒక్కటే సరిపోదు. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ మొండి మరకలను తొలగించి వస్తువులను మెరిసేలా చేయవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 18 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bathroom Buckets Hacks : సహజంగా బాత్ రూమ్ లోని బకెట్స్ (Buckets), ముగ్గుల (Mugs) పై మొండి మరకలు (Stains) అలాగే పేరుకుపోవడం గమనిస్తుంటాము. ఈ మరకలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. వీటిని శుభ్రం చేయడానికి డిటర్జెంట్ ఒక్కటే సరిపోదు. ఎందుకంటే ఈ మరకలు చాలా మొండిగా మారుతాయి, అవి సులభంగా తొలగించబడవు. అయితే కేవలం ఇంటి చిట్కాలతోనే వీటిని మెరిసేలా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.. బకెట్, మగ్‌పై నీటి మరకలను శుభ్రపరచడానికి చిట్కాలు బేకింగ్ సోడాను ఉపయోగించడం ద్వారా, పసుపు రంగులోకి మారిన బకెట్ ను సులభంగా శుభ్రం చేయవచ్చు. ముందుగా ఒక పాత్రలో బేకింగ్ సోడా, డిష్ సోప్, నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత, టూత్ బ్రష్ సహాయంతో, ఈ పేస్ట్‌ను బకెట్‌పై అప్లై చేసి బాగా రుద్దాలి. బకెట్ బాగా మురికిగా ఉన్నప్పుడు, పేస్ట్ అప్లై చేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై రుద్ది శుభ్రం చేయాలి. దీని తర్వాత సాధారణ నీటితో బకెట్ కడగాలి. జిడ్డుగా మారిన బకెట్స్, ముగ్గులను మెరిసేలా చేయడానికి వైట్ వెనిగర్ (White Vinegar) సహాయం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీని కోసం, 2 కప్పుల వైట్ వెనిగర్‌తో కొంచెం నీరు కలపండి. ఈ ద్రావణంలో స్పాంజిని నానబెట్టి, బకెట్‌పై పూర్తిగా రుద్దండి. దీని తర్వాత, సాధారణ నీటితో రెండింటినీ శుభ్రం చేయండి. బ్లీచ్ పౌడర్ తో మరింత మెరుగ్గా ఉంటుంది. మొండి మరకలను తొలగించడానికి బ్లీచ్ పౌడర (Bleach Powder) చాలా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి ఉత్తమంగా పరిగణించబడుతుంది. దీని కోసం బ్లీచ్ పౌడర్‌ని ఒక కప్పు నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత బకెట్, మగ్ మీద అప్లై చేయాలి. ఆ పై కొద్దిసేపు బ్రష్‌తో రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. Hair Care: జుట్టుకు గుడ్డు అప్లై చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! - Rtvlive.com #hacks #bathroom-buckets #mugs #stains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి