ఈవీ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?అయితే కొన్నిరోజులు ఆగండి..!!

New Update

మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని రోజులు వేచి ఉండటం మంచిది. ఎందుకుంటే సింపుల్ ఎనర్జీ కంపెనీ చాలా తక్కువ ధరకే ఈవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Ola, Ather, Okinawa, Hero వంటి బ్రాండ్‌ల కంటే చాలా తక్కువ ధర ఉండే అవకాశం ఉంది. సింపుల్ ఎనర్జీ కంపెనీ వచ్చే త్రైమాసికంలో రెండు కొత్త ఈ స్కూటర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

simple energy

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీని అందించినప్పటి నుండి నానాటికీ తగ్గుతున్న అమ్మకాలతో ఇబ్బంది పడుతున్న ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఇప్పుడు చౌకైన ద్విచక్ర వాహనాలను విడుదల చేయడంపై దృష్టి సారించాయి. కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న ఇండియన్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తాజాగా ఓ ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. సింపుల్ ఎనర్జీ ప్రకారం, కంపెనీ వచ్చే త్రైమాసికంలో రెండు కొత్త ఇ-స్కూటర్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వాటి ధరలు Ola, Ather, Okinawa, Hero వంటి బ్రాండ్‌ల కంటే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కంపెనీ వ్యవస్థాపకుడు సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లోపు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోందని తెలిపారు. ఈ ఇ-స్కూటర్ల ధర వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉంటుందని తెలిపారు. తక్కువ ధర ఇ-స్కూటర్‌తో, కంపెనీ తన ప్రతిపాదిత $100 మిలియన్ల నిధుల సేకరణ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించగలదని రాజ్‌కుమార్ చెప్పారు.

ఇ- కారును కూడా లాంచ్ చేసేందుకు ప్లాన్:

వచ్చే మూడేళ్లలో మూడు స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండాలనే కంపెనీ ప్రణాళికలో భాగంగానే తక్కువ ధరకే ఈ-స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇది కాకుండా, రాబోయే మూడేళ్లలో కంపెనీ నుంచి ఇ కారును కూడా లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ గత నెలలో తన మొదటి ప్రీమియం ఇ-స్కూటర్ సింపుల్ వన్‌ను రూ. 1.45 లక్షలతో పరిచయం చేసింది. కంపెనీ బెంగళూరులో దశలవారీగా ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించింది.

జూన్ 1 నుంచి పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు:

జూన్ 1 నుండి, భారతదేశంలో విక్రయించే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ధరలు పెరిగాయి. జూన్ 1న లేదా ఆ తర్వాత నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ (FAME 2) తగ్గించింది. ద్విచక్ర వాహన EVలకు గరిష్ట సబ్సిడీ వాహనం విలువలో ప్రస్తుతం ఉన్న 40% నుండి 15శాతానికి తగ్గించింది. దీని వల్ల కంపెనీలు మునుపటిలాగా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నాయి. EV మేకర్ ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో తన S1 శ్రేణి ధరలను పెంచింది. Ola ప్రస్తుతం మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు - Ola S1, S1 Pro, S1 Air ధరలను పెంచింది. ఓలా ఎలక్ట్రిక్ ఓలా ఎస్1 ధరను రూ.1,14,999 నుంచి రూ.1,29,999కి పెంచింది. అదే సమయంలో, S1 ఎయిర్ ఇప్పుడు రూ.84,999 నుండి రూ.99,999కి పెరిగింది. లైనప్‌లోని అత్యంత ప్రీమియం మోడల్, S1 ప్రో ధర రూ. 1,24,999 నుండి రూ. 1,39,999 వరకు ఉంది.

FAME-II అంటే ఏమిటి?

ఈ పథకం 3 సంవత్సరాల కాలానికి ఏప్రిల్ 1, 2019 నుండి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మార్చి 31, 2024 వరకు మరో 2 సంవత్సరాలు పొడిగించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు