Sikkim Flash Floods : సిక్కింలో కుంభవృష్టి..14 మంది దుర్మరణం.. ఎంతమంది మిస్ అయ్యారంటే భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం భయభ్రాంతులకు గురి అవుతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిపస్తోంది. దీంతో తీర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది యువత మరణించారు. By Vijaya Nimma 05 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Sikkim Flash Floods: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం భయభ్రాంతులకు గురి అవుతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు (Lhonak Lake) పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిపస్తోంది. దీంతో తీర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది యువత మరణించారు. అంతేకాకుండా.. 22 మంది ఆర్మీ జవాన్లతో (Army Personnel) పాటు మొత్తం 102 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 25 మంది క్షతగాత్రులతో పాటు.. వరద నీటిలో చిక్కుకున్న 45 మంది ప్రజలని రక్షించామని పేర్కొన్నారు. కూలిన వంతెనలు ⚡️⚠️ 𝐄𝐍𝐃 𝐓𝐈𝐌𝐄 𝐒𝐂𝐄𝐍𝐀𝐑𝐈𝐎⚠️⚡️ 𝐃𝐞𝐯𝐚𝐬𝐭𝐚𝐭𝐢𝐧𝐠 𝐟𝐥𝐨𝐨𝐝 𝐢𝐧 𝐒𝐢𝐤𝐤𝐢𝐦,𝐈𝐧𝐝𝐢𝐚 As many as 10 civilians have died and 82 people, including 22 Army personnel, are missing after a cloudburst over the Lhonak Lake in north Sikkim caused it to overflow,… pic.twitter.com/rBOrPhUjkK — {Matt} $XRPatriot (@matttttt187) October 5, 2023 భారీ వర్షాలతో సింగ్‌తామ్ దగ్గర వరద ప్రవాహంలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోగా బుధవారం (నిన్న) సాయంత్రం సహాయక బృందాలు ఓ సైనికుడిని కాపాడేరు. సిక్కిం రాష్ట్రంలో భారీ వరదల వల్ల14 వంతెనలు కూలిపోయాయని ఆధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభం కాగా.. బుధవారం చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారిందని సిక్కిం రాష్ట్ర అధికారులు తెలియజేశారు. Also Read: రాహుల్ గాంధీ కి చిక్కులు తెచ్చిపెట్టిన ”నూరీ” జాతీయ రహదారి ధ్వంసం People being rescued and taken to a safe shelter. They didn’t have any say in large infrastructure project, but pay the price of the disaster. #Sikkim pic.twitter.com/KdKu3yIOdT — Aparna (@chhuti_is) October 4, 2023 ఇక భారీ వర్షంతో రాజధాని గాంగ్‌టక్‌కు (Gangtok) 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్‌తామ్ (Singtam) ఉక్కు వంతెన వరద ప్రవాహనికి నిన్న తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. అంతేకాదు రహదారులపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అయితే.. ఈ వర్షాలు, వరద విలయాన్ని సిక్కిం సర్కార్ ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. పాక్‌యోంగ్, మాంగాన్, గాంగ్‌టక్, నామ్చీ జిల్లాల్లో స్కూ్ల్ల్‌కు ప్రభుత్వం నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. వరద ప్రభావంపై హెచ్చరికలు జారీ చేసి..తీస్తా నది ప్రవాహ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర బెంగాల్‌కు అధికారులు సూచించారు. చుంగ్‌తాంగ్‌లోని తీస్తా స్టేజ్-3 డ్యామ్ దగ్గర పనిచేస్తున్న 14 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్నారు. చుంగ్‌తాగ్, ఉత్తర సిక్కింలో మొబైల్ నెట్‌వర్క్‌లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు చాలా వరకు అంతరాయం ఏర్పడింది. చుంగ్తాంగ్‌లోని పోలీస్ స్టేషన్‌తో పాటు చుట్టు పక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. #sikkim-floods #sikkim-flash-floods #jawans-among #teesta-river #14-people-died మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి