Fruit Juice:ఈ జ్యూస్ తాగితే అంతే సంగతి.. తస్మాత్‌ జాగ్రత్త!

ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం వేగంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఫ్రెష్ జ్యూస్‌కి బదులుగా క్యాన్డ్ జ్యూస్ వల్ల కాలేయంతోపాటు గుండె, డిమెన్షియా, మెదడు పొగమంచు, క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు.

Fruit Juice:ఈ జ్యూస్ తాగితే అంతే సంగతి.. తస్మాత్‌ జాగ్రత్త!
New Update

Side Effects Packaged Juice: ప్రస్తుత కాలంలో చాలామంది తరచుగా ఆహారం, పానీయాలను తయారు చేయడంలో షార్ట్‌కట్‌ల కోసం చూస్తారు, ప్యాక్ చేసిన ఆహారాన్ని ఉపయోగిస్తారు. కానీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌లో అధిక కేలరీలు, చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్స్ కలిపి తయారుచేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. వాటిలో ఒకటి క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్. ఇది చాలామంది ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజూ ఉదయం తాగుతారు. అయితే ICMR నివేదిక ప్రకారం.. ఈ క్యాన్డ్ జ్యూస్‌లు చక్కెర ద్రావణం ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలిగిస్తాయని అంటున్నారు. క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్ అనేది స్లో పాయిజన్ అని టెట్రా ప్యాక్‌లు, పెద్ద పెట్టెల్లో వచ్చే పండ్ల రసాలలో తాజా పండ్లే ఉండవని, వాటి రుచులను కలిపి వాటిని తీయడానికి కృత్రిమ చక్కెరను ఉపయోగిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇందులో కార్న్ సిరప్ వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పండ్ల రసాలపై చేసిన లేబులింగ్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. అలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్యాకేజ్డ్ జ్యూస్‌లు సులువుగా లభిస్తాయి, తాజా పండ్ల రసాన్ని తాగుతున్నట్లు అనుకుంటారు. అందుకే ఈ రోజుల్లో దాని వినియోగం చాలా పెరిగిందని ICMR ఓ నివేదిక పేర్కొన్నారు.

ప్యాకేజ్డ్ జ్యూస్ నష్టాలు:

ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని ఎక్కువసేపు తీసుకుంటే, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే అందులో చక్కెరను ఎక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. అంతేకాదు కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయ వైఫల్యం, కొవ్వు కాలేయానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.

గుండె సంబంధిత సమస్యలు సంభవించవచ్చు, ఈ క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్‌లను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల డిమెన్షియా, మెదడు పొగమంచు, క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు. ఈ క్యాన్డ్ పండ్ల రసాలు ఖరీదైనవి, ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతాయి. ఆ సమయంలో తాజా రసం తాగాలి, తాజా పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also ReaD: మీ పిల్లలు పెరుగుతున్నారా? తల్లిదండ్రుల కోసం ప్రత్యేక చిట్కాలు..!

#life-style
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe