Guava Side Effects: సాధారణంగా జామకాయ పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ , పొటాషియం, ఫైబర్, విటమిన్ C ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటి వల్ల కొన్ని సమస్యలు ఉన్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగే ప్రమాదం ఉంది. అవేంటో తెలుసుకోండి.
Also Read: Life Style: సూర్యస్తమయం తర్వాత.. ఈ పనులు చేస్తే దురదృష్టం..!
జామకాయ తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్
- మెడికేషన్ తీసుకునే వారు జామకాయను తినే ముందు వైద్యులను సంప్రదించాలి. దీని వల్ల శరీరంలో మెడిసిన్ శోషణకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా లేదా అనే విషయాన్నీ తెలుసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి హానీ కలిగించే ప్రమాదం ఉంటుంది.
- కొంత మందికి కొన్ని ఆహారాలకు చాలా సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అలాగే కొందరిలో జామకాయ తింటే అలర్జిక్ రియాక్షన్స్ కలిగించే అవకాశం ఉంటుంది. దద్దుర్లు, దురద, వాపు వంటి సమస్యలకు కారమవుతుంది. కానీ ఇలాంటి సమస్య చాలా తరచుగా కనిపిస్తుంది.
- జామకాయలో హై డైటరీ ఫైబర్ ఉంటుంది. దాని వల్ల ఈ ఫ్రూట్ ఎక్కువగా తిన్నపుడు వీటిలోని హై డైటరీ ఫైబర్ జీర్ణక్రియ సమస్యలకు కారమవుతుంది. కడుపుబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైబర్ ఆరోగ్యానికి మంచిది కానీ మోతాదుకు మించి తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి.
- ఈ పండులోని అధిక పొటాషియం కంటెంట్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి మంచిది కాదు. అలాగే జామకాయలోని ఆక్సలేట్ కాంపౌండ్స్ కిడ్నీ స్టోన్స్ పై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునేటప్పుడు వైద్యులను సంప్రదించడం బెటర్ .
- ప్రతీ పండు లాగే జామకాయను కూడా పెస్టిసైడ్స్ వాడతారు. కొన్ని సార్లు వాటి పై పెస్టిసైడ్స్ అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తినేముందు శుభ్రంగా కడగాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
Also Read: Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..?