Guava Side Effects: జామకాయతో ఆరోగ్యమే కాదు.. అనారోగ్యం కూడా అదేంటో తెలుసుకోండి..?

జామకాయ తింటే ఆరోగ్యానికి చాలా మేలు. అలాగే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీటిలోని హై డైటరీ ఫైబర్, ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, కిడ్నీ సమస్యలు ఉన్నవారి పై ప్రభావం చూపుతాయి. కొంత మందిలో ఇది అలెర్జిక్ రియాక్షన్స్ కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.

New Update
Guava Side Effects: జామకాయతో ఆరోగ్యమే కాదు.. అనారోగ్యం కూడా అదేంటో తెలుసుకోండి..?

Guava Side Effects: సాధారణంగా జామకాయ పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ , పొటాషియం, ఫైబర్, విటమిన్ C ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వీటి వల్ల కొన్ని సమస్యలు ఉన్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగే ప్రమాదం ఉంది. అవేంటో తెలుసుకోండి.

Also Read: Life Style: సూర్యస్తమయం తర్వాత.. ఈ పనులు చేస్తే దురదృష్టం..!

జామకాయ తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్

  • మెడికేషన్ తీసుకునే వారు జామకాయను తినే ముందు వైద్యులను సంప్రదించాలి. దీని వల్ల శరీరంలో మెడిసిన్ శోషణకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా లేదా అనే విషయాన్నీ తెలుసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి హానీ కలిగించే ప్రమాదం ఉంటుంది.
  • కొంత మందికి కొన్ని ఆహారాలకు చాలా సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అలాగే కొందరిలో జామకాయ తింటే అలర్జిక్ రియాక్షన్స్ కలిగించే అవకాశం ఉంటుంది. దద్దుర్లు, దురద, వాపు వంటి సమస్యలకు కారమవుతుంది. కానీ ఇలాంటి సమస్య చాలా తరచుగా కనిపిస్తుంది.

publive-image

  • జామకాయలో హై డైటరీ ఫైబర్ ఉంటుంది. దాని వల్ల ఈ ఫ్రూట్ ఎక్కువగా తిన్నపుడు వీటిలోని హై డైటరీ ఫైబర్ జీర్ణక్రియ సమస్యలకు కారమవుతుంది. కడుపుబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైబర్ ఆరోగ్యానికి మంచిది కానీ మోతాదుకు మించి తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి.
  • ఈ పండులోని అధిక పొటాషియం కంటెంట్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి మంచిది కాదు. అలాగే జామకాయలోని ఆక్సలేట్ కాంపౌండ్స్ కిడ్నీ స్టోన్స్ పై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునేటప్పుడు వైద్యులను సంప్రదించడం బెటర్ .
  • ప్రతీ పండు లాగే జామకాయను కూడా పెస్టిసైడ్స్ వాడతారు. కొన్ని సార్లు వాటి పై పెస్టిసైడ్స్ అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తినేముందు శుభ్రంగా కడగాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Also Read: Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..?

Advertisment
తాజా కథనాలు