శ్రీ పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్‌రావు

తెలంగాణలో ఆషాడం జాతర మొదలైంది. వివిధ ప్రాంతాలలో అమ్మవార్లకు బోనాలు చేస్తూ ఊరంతా పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు సుభాష్‌నగర్‌లో శ్రీ పోచమ్మ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.

New Update
శ్రీ పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్‌రావు

Siddipet Minister HarishRao performed special pooja at SriPochamma temple

బోనాల పండుగ ఉత్సవాలు

ఆషాడ మాసం పురస్కరించుకుని పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న గ్రామ దేవతల బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ సుభాష్‌నగర్‌లోని శ్రీ పోచమ్మ ఆలయానికి ఆ ప్రాంత కాలనీ వాసులు పెద్దఎత్తున తరలివచ్చి మైలలు తీయుట, బియ్యం సుంకు పట్టుట, బోనాలు తీయుట, గావు పట్టుట కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు కుటుంబ సమేతంగా హాజరవుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ మేరకు ఆలయంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

అమ్మవారి దయతో మళ్లీ అధికారం మనదే..

అనంత‌రం హ‌రీష్‌రావు మాట్లాడుతూ…సుభాష్‌నగర్‌లోని శ్రీ పోచమ్మ అమ్మవారిని దర్శించుకోటం సిద్ధిపేట ప్రాంత ప్రజల అదృష్టమ‌ని చెప్పారు. అమ్మవారి కరుణతో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖఃసంతోషాలతో ఉండాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ పండుగ అందరి ఇంట్లో ఆనందాన్ని నింపాలని కోరుతున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలందరికీ అండగా ఉంటున్నారు. బంగారు తెలంగాణలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన సీఎంకి ప్రజలందరూ తోడు ఉండి..మళ్లీ బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మంత్రి ప్రజలకి విజ్ఞప్తి చేశారు.

సందడే.. సందడి

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించారు. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేసి అందరికీ ఇబ్బంది కలగకుండా దర్శనాలు చేపిస్తున్నారు ఆలయ అధికారులు. డప్పులతో.. భక్తుల సందడితో సుభాష్‌నగర్‌లో సందడి వాతావరణం నెలకొన్నది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు