siddipet: మహానుభావులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా: మంత్రి హరీష్‌రావు

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రసంగించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది.

siddipet: మహానుభావులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా: మంత్రి హరీష్‌రావు
New Update

అద్భుతంగా కృషి చేశాం

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రసంగించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆనాటి వీరయోధులైన కొమరంభీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్థ. సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్‌స్వామి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది. 1956లో రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్ర వారి దోపిడీ విధానాలు, తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు చూడడంతో ఆంధ్రప్రదేశ్ ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. అందుకే ఏపీ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది.

ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది..

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఇప్పటి గౌరవ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించి తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పధ్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించి లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెల్లడం వలన తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది. దాంతో 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా అలరారుతు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నదన్నారు.

సంతోషంగా, సంతృప్తిగా ఉంది

సిద్దిపేట జిల్లా చరిత్రలోనూ సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతోపాటు ప్రగతిశీల విజయ వీచికలను సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉంది. ఒకప్పుడు ఎన్నికల హామీలుగా, సిద్దిపేట భవిష్యత్తుకు ట్యాగ్‌ లైన్లుగా ఉన్న జిల్లా కేంద్రం ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యాలను నేడు హెడ్‌ లైన్లుగా మార్చుకోవడం జరిగింది. ఏడు దశాబ్దాలుగా ఊరిస్తూ వచ్చిన చిరకాల వాంఛలను తొమ్మిదేళ్ల ప్రాయంలోనే గమ్యం చేర్చుకున్నామంటే తెలంగాణ స్వరాష్ట్రం సిద్దించడం, సీఎంగా ఈ ప్రాంత బిడ్డ కేసీఆర్‌ ఉన్నందువల్లేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  నాటి నినాదాలనే నిజాలుగా చేసుకున్నామని ఈ ప్రతిష్టాత్మకమైన సందర్భంలో మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందన్నారు.

#siddipet #bow-to-all-of-them #great-people #telangana-national-unity-day #minister-harish-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe