Telangana News: తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు..ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి కాషాయ కండువాలు

తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది . నేడు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్‌ నివాసంలో బీజేపీలో చేరారు శ్రీశైలం ముదిరాజ్. సిద్దిపేటకు చెందిన కానిస్టేబుల్ శ్రీశైలం ముదిరాజ్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు.

New Update
Telangana News: తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు..ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి కాషాయ కండువాలు

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఏపీఎన్జీవో నాయకులు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కడుపు మండిన ఇద్దరు కానిస్టేబుల్‌ శ్రీశైలం ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగం పోతుందని తెలిసి కూడా జై తెలంగాణ నినాదాలు చేశారని ఈటల తెలిపారు. అప్పుడు నేను వారిని అభినందించి సత్కారం కూడా చేశానని ఈటల గుర్తు చేశారు. కానీ వచ్చిన తెలంగాణలో అనుకున్న ఫలితాలు అనుకున్న వర్గాలకు అందలేదని ఈటల ఫైర్‌ అయ్యారు. ఆత్మగౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల పక్షాన నిలబడాలని దానికి సరైన వేధిక బీజేపీ అని భావించి మా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారని ఆయన తెలిపారు. సిద్దిపేటలో బహిరంగ సభ పెట్టి పెద్దఎత్తున జాయినింగ్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట లాంటి గడ్డమీద ఇలా ఉంటే తెలంగాణ గడ్డమీద ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఈటల తెలిపారు. సిద్దిపేట గడ్డమీద తెలంగాణ ప్రజల ఆత్మగౌరవపేరిట ఎగిరే సందర్భం ఆసన్నమైందన్నారు. ప్రజలు ఆలోంచించాలని ఈటల విజ్ఞప్తి చేశారు. మా సంపూర్ణ మద్ధతు ఉంటుందని హామీ ఇస్తున్న బీజేపీ రాష్ట్ర ఎన్నికలనిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు.

శ్రీశైలం ముదిరాజ్ మాట్లాడుతూ.. సిద్దిపేటలో అరాచకం నడుస్తుందని మండిపడ్డారు. అక్కడివారిని ఎదుర్కొనే సత్తా ఈటలకే ఉందని ఆయన ఆధ్వర్యంలో బీజేపీలో చేరానని తెలిపారు. ఉద్యమ సమయంలో మేము చేసిన పనికి చాలా హామీలు ఇచ్చారు. కానీ బలహీనవర్గాల బిడ్డలు కాబట్టి ఒక్కటీ నెరవేర్చలేదని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. సిద్దిపేటలో హరీష్‌రావు ఏది చెప్తే అదే.. అయ్యా బాంచన్ అంటేనే పనులు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఏంది అని ప్రశ్నిస్తే వేధిస్తున్నారని శ్రీశైలం ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ల దొరల ప్రభుత్వాన్ని ఇంటికిపంపే సత్తా ఈటల రాజేందర్‌కే ఉందని శ్రీశైలం తెలిపారు. తెలంగాణ రాజకీయాలను పూర్తిగా చెడగిట్టింది, నాశనం చేసింది రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. అప్పట్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. ఇప్పుడు డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని.. కాంగ్రెస్ పార్టీ దొంగకు తాళం చెవులు అప్పగించారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ భూములు అమ్మితే.. రేవంత్ ఏకంగా మనుషులను, వారి అవయవాలను అమ్ముతారని శ్రీశైలం ఆరోపించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు ఏమైనా జరిగితే భువనేశ్వరిపైనే అనుమానం: నారాయణస్వామి

Advertisment
Advertisment
తాజా కథనాలు