Tillu Square: వేసవి సెలవులు సినిమాలకు మంచి సీజన్ అని అంటారు. అయితే, ఐపీఎల్ వచ్చిన తరువాత వేసవి సీజన్ సినిమాల జోరు తగ్గింది. పెద్ద హీరోల సినిమాలు వేసవి టార్గెట్ గా రావడం తగ్గిపోయింది. చిన్న సినిమాలు.. తమ ఉనికిని చాటుకోవడానికి సమ్మర్ ను సెలక్ట్ చేసుకుంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు ఈ సీజన్ లో బాక్సాఫీస్ దగ్గర ఐపీఎల్ దాడిని తట్టుకుని మరీ సంచలనాలు సృష్టిస్తున్నాయి. సరిగ్గా ఇలా సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసుకుని సిద్ధూ జొన్నలగడ్డ.. తన టిల్లూ తో థియేటర్లను పలకరించాడు. టిల్లూ సీక్వెల్ గా టిల్లూ స్క్వేర్(Tillu Square) ను సమ్మర్ టార్గెట్ గా తీసుకొచ్చి.. తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అవును టిల్లూ స్క్వేర్(Tillu Square) సినిమా ఇప్పుడు థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న ఒకే ఒక్క సినిమాగా నిలిచింది. మూడు వారాలు పూర్తి కావస్తున్నా.. ఇప్పటికీ బాక్సాఫీస్ లీడర్ గా సత్తా చాటుతోంది టిల్లూ స్క్వేర్. టిల్లూ స్క్వేర్ తరువాత వచ్చిన సినిమాలు ఏవీ కూడా పెద్దగా ప్రేక్షకులకు రీచ్ అవలేదు. నిజానికి ఈసినిమా విడుదలైన వారం తరువాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ.. ఆ వారం వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కు డివైడ్ టాక్ రావడంతో.. మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక తరువాత మలయాళ రీమేక్ మంజుమెల్ బాయ్స్ వచ్చిన కానీ, తన ట్రాక్ అలానే కొనసాగింది. సెకండ్ వీకెండ్ లో కూడా బాక్సాఫీస్ దగ్గర Tillu Square నెంబర్ వన్ గా నిలబడింది.
Also Read: మెగాస్టార్ చిరు ఎంతో ఇష్టపడి చేస్తే వచ్చింది జీరో అట..!
ఇక మూడోవారంలో ఉగాది, రంజాన్ సెలవులు టిల్లూ(Tillu Square) కు బాగా కలిసొచ్చాయి. ఈ సమయంలో కాస్త ప్రభావం చూపిస్తుంది అనుకున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అనుకున్నంతగా నిలబడలేదు. దీంతో టిల్లూ జోరు ఆగలేదు.
బుక్ మై షో టికెట్ల అమ్మకాల్లో ఇప్పటికీ టిల్లూ(Tillu Square) హంగామానే నడుస్తోంది. దాని తరువాతే మిగిలిన సినిమాలు ఉన్నాయి. నిన్నటితో ఉగాది లాంగ్ హాలీడేస్ ముగిసినట్లే. ఈ వీక్ డేస్ లో టిల్లూ ఎలా నిలబడతాడో చూడాలి. ఎలా చూసినా.. ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద నాలుగు వారాల దాకా నెంబర్ వన్ పొజిషన్ లో స్టేబుల్ గా ఉన్న సినిమా టిల్లూ స్క్వేర్ అనే చెప్పాలి.