Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో హీరో రవితేజ, సిద్దార్థ్ సందడి.. ముగ్గురు ఎలిమినేటెడ్..!

ఉల్టా పుల్టా అనే మాటను నిజం చేస్తూ బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ అంటూ బిగ్ బాస్ టీం ఈరోజు ప్రోమోను విడుదల చేసింది.  ప్రోమో అదిరిపోయింది. ప్రోమోలో టాలీవుడ్ హీరోలు సిద్దార్థ్, మాస్ మహారాజ రవితేజ సందడి చేసారు. సిద్దార్థ్ ఇంట్లో కి వెళ్లి హౌస్ మేట్స్ తో గేమ్ కూడా ఆడాడు. ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది.

New Update
Bigg Boss 7 Telugu Promo:  బిగ్ బాస్ ఇంట్లో హీరో రవితేజ, సిద్దార్థ్ సందడి.. ముగ్గురు ఎలిమినేటెడ్..!

Ravi Teja and Siddharth in Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అంచనాలకు మించి కనిపిస్తుంది. గతంలో జరిగిన సీజన్ 6 అంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది.. ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న వార్తలు కూడా వినిపించాయి. దాంతో బిగ్ బాస్ మేకర్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి, బిగ్ బాస్ సీజన్7 ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకుల్లో ఒక బజ్ క్రియేట్ చేసారు. ఉల్టా పుల్టా అంటే గత సీజన్స్ లో ఎప్పుడు జరగనిది ఈ సీజన్లో జరగబోతుంది, ఈ సీజన్ ఊహించని విధంగా ఉండబోతున్నట్లు తెలిపారు.

బిగ్ బాస్ 7  2.0 గ్రాండ్ లాంచ్

ఉల్టా పుల్టా అనే మాటను నిజం చేస్తూ బిగ్ బాస్ 2.0 (Bigg Boss 7 2.0) గ్రాండ్ లాంచ్ అంటూ బిగ్ బాస్ టీం ఈరోజు ప్రోమోను విడుదల చేసింది.  ప్రోమో అదిరిపోయింది. ప్రోమోలో టాలీవుడ్ హీరోలు సిద్దార్థ్ (Hero Siddharth), మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) సందడి చేసారు. సిద్దార్థ్ ఇంట్లో కి వెళ్లి హౌస్ మేట్స్ తో గేమ్ కూడా ఆడాడు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ (Wild Card Entries)

ఈ వీకెండ్ చాలా గ్రాండ్ ఎపిసోడ్ ప్లాన్ చేసారు. ఇప్పటి వరకు మేకర్స్ దీని హైడ్ చేస్తూ బిగ్ బాస్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ 2.0 ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు.

Also Read: పుష్ప 2 సినిమా అదిరిపోయే క్లైమాక్స్ ఇదే..!

ఎలిమినేషన్ ట్విస్ట్

ఈ ప్రోమోలో నాగార్జున (Nagarjuna) హౌస్ మేట్స్ కు పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇప్పటికే పవర్ అస్త్రాను గెలిచి ఇంటి సభ్యులుగా అర్హత పొందిన శోభా, శివాజీ, ప్రశాంత్, సందీప్ ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లాలో డిసైడ్ చేస్తారని షాక్ ఇస్తాడు. అలాగే ఈ ఐదు వారాలలో టాప్ కంటెస్టెంట్ ఎవరో మీ అభిప్రాయాన్ని చెప్పండని అడుగుతారు. దాని తర్వాత నాగార్జున నామినేషన్స్ లో ఉన్న వాళ్లందురు గుడ్ బాయ్ చెప్పేయండి, మళ్ళీ మీరు రావచ్చు, రాకపోవచ్చని ఇంటి సభ్యులను టెన్షన్ పెడతాడు.

ఎప్పటిలా ఫస్ట్ సేవ్ అయ్యేదెవరో కాకుండా ఈ సారి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేదెవరు తెలుస్తుందని, హౌస్ మేట్స్ అందరిని యాక్టీవిటీ రూమ్ లో నిల్చోమంటారు. ఆ రూమ్ ను దయ్యలా గదిలా భయంకరంగా సెట్అప్ చేసారు.. అంతేకాదు ఆ దయ్యం ఎవరి దగ్గర నిల్చుంటే వాళ్ళు ఎలిమినేట్. ఇక అందరి మొహాల్లో టెన్షన్ మొదలైంది.

ఇక ఈరోజు ఎపిసోడ్ సెలెబ్రెటీలు ట్విస్ట్ లు, ఎలిమినేషన్స్ తో రచ్చ రచ్చ ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. అసలు ఎంత మంది ఎలిమినేట్ అవుతారు, ఎంత మంది వైల్డ్ కార్డ్ వస్తారని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.

 Also Read: Bigg Boss 7: ఉల్టా పుల్టా, డబుల్ ఎలిమినేషన్..! ఆ ఇద్దరు సీక్రెట్ రూమ్..?

#siddharth-in-bigg-boss-7-telugu #ravi-teja-in-bigg-boss-7-telugu #bigg-boss-7-contestants-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Advertisment
తాజా కథనాలు