Siddharth Anand: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఫైటర్’ (Fighter) బోల్డ్ సీన్స్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోహీరోయిన్ల మధ్య సన్నిహిత సంబంధాలు అతిగా ఉన్నాయని, ముఖ్యంగా ఎయిర్ఫోర్స్ (Air force) యూనిఫాం ధరించి ముద్దు సీన్లలో రెచ్చిపోవడంపై ఎయిర్ఫోర్స్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్య దీప్దాస్.. మూవీ యూనిట్ కు లీగల్ నోటీసులు పంపించారు. అయితే దీనిపై తాజాగా దర్శకుడు ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Fighter: అప్పుడు ఓకే అని ఇప్పుడు కేసులా.. ముద్దు సీన్ ఇష్యూపై డైరెక్టర్ అసహనం
‘ఫైటర్’ మూవీలో బోల్డ్ సీన్స్ ఇష్యూపై డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. 'ఎయిర్ఫోర్స్పై నాకు చాలా గౌరవం ఉంది. రూల్స్ ప్రకారమే సినిమా తెరకెక్కించాం. సెన్సార్ కంప్లీట్ కాగానే 100 మంది ఎయిర్ ఫోర్స్ అధికారులకు మూవీ చూపించాం. ఒకే అన్నాకే రిలీజ్ చేశాం' అని చెప్పారు.
Translate this News: