Fighter: అప్పుడు ఓకే అని ఇప్పుడు కేసులా.. ముద్దు సీన్‌ ఇష్యూపై డైరెక్టర్ అసహనం

‘ఫైటర్‌’ మూవీలో బోల్డ్ సీన్స్ ఇష్యూపై డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. 'ఎయిర్‌ఫోర్స్‌పై నాకు చాలా గౌరవం ఉంది. రూల్స్ ప్రకారమే సినిమా తెరకెక్కించాం. సెన్సార్‌ కంప్లీట్ కాగానే 100 మంది ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులకు మూవీ చూపించాం. ఒకే అన్నాకే రిలీజ్ చేశాం' అని చెప్పారు.

New Update
Fighter: అప్పుడు ఓకే అని ఇప్పుడు కేసులా.. ముద్దు సీన్‌ ఇష్యూపై డైరెక్టర్ అసహనం

Siddharth Anand: బాలీవుడ్‌ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఫైటర్‌’ (Fighter) బోల్డ్ సీన్స్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోహీరోయిన్ల మధ్య సన్నిహిత సంబంధాలు అతిగా ఉన్నాయని, ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌ (Air force) యూనిఫాం ధరించి ముద్దు సీన్లలో రెచ్చిపోవడంపై ఎయిర్‌ఫోర్స్‌ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్‌.. మూవీ యూనిట్ కు లీగల్ నోటీసులు పంపించారు. అయితే దీనిపై తాజాగా దర్శకుడు ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు.

వాళ్లంటే గౌరవమే..
సిద్ధార్థ్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌ఫోర్స్‌పై నాకు చాలా గౌరవం ఉంది. రూల్స్ అండ్ రెగ్యూలేషన్ ప్రకారమే సినిమా తెరకెక్కించాం. స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టినప్పటినుంచి సెన్సార్‌ రిపోర్ట్‌ వరకు ప్రతి విషయాన్ని వాయుసేన అధికారులతో చర్చించాం. సెన్సార్‌ కంప్లీట్ కాగానే ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది అధికారులకు ఈ సినిమాను చూపించాం. ఎవరూ అప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. సర్టిఫికెట్‌ ఫిజికల్‌ కాపీ కూడా మా దగ్గర ఉంది. అయితే ముద్దు సీన్లపై ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరుతో ఐఏఎఫ్‌లో ఏ అధికారి లేరని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారో మాకు తెలియడం లేదు. కావాలనే మాపై బురద జల్లుతున్నారు' అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Telangana Budget 2024: ఆరు గ్యారెంటీలే హైలైట్..సమానత్వమే లక్ష్యంగా..తెలంగాణ మధ్యంతర బడ్జెట్!

భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.350 కోట్లు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు