Saidabad: ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతితో ఎస్ఐ ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశారు. చివరకు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు సదరు ఎస్ఐపై ఫిర్యాదు చేయగా.. హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతి జూనియర్ ఆర్టిస్టుగా సినిమాల్లో చేస్తుంది. సైదాబాద్ పీఎస్ పరిధిలోని తన మేనత్త ఇంట్లో ఉంటూ సినిమాల్లో నటించేది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
అయితే గతేడాది జనవరిలో అత్త, మామల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ విషయమై.. పోలీసులు ఫిర్యాదు చేసేందుకు సైదాబాద్ పీఎస్‌కు వెళ్లింది. ఆ సమయంలో ట్రైనీ ఎస్సైగా ఉన్న నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్ (29).. క్రమంగా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. యువతి ఫోన్ నంబరు తీసుకొని తరచూ ఫోన్లో, వాట్సాప్‌లో చాట్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించాడు. ఆపై పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆరునెలల క్రితం సదరు యువతి అరుణ్ ఫోన్లో అతడి నిశ్చితార్థం ఫోటోలు చూసింది. తనను మోసం చేశావంటూ నిలదీసింది. అయితే ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటానని అరుణ్ నమ్మబలికాడు.
ఇది కూడా చదవండి : Actor Ali: ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అలీ.. ఎక్కడినుంచి పోటీ చేస్తారంటే?
పెళ్లి ప్రస్తావన వాయిదా..
ఆ తర్వాత నెలల గడుస్తున్నా.. అరుణ్ పెళ్లి ప్రస్తావన వాయిదా వేస్తూ వస్తున్నాడు. యువతి అరుణ్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి అన్నకు ఫోన్ చేసి తమ సంబంధం గురించి చెప్పింది. ఈ క్రమంలో అరుణ్ యువతికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు సైదాబద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్సై అరుణ్‌ను అరెస్టు చేశారు.