‘Shubh Muhurt’ for Pran Pratishtha is 12.30 pm on Jan 22: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి 22న అయోధ్యలోని రామమందిరం (Ayodhya Ram Mandir)లో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది వీఐపీలు పాల్గొననున్నారు. అయితే తాజాగా రామ్‌లల్లా విగ్రహాన్ని ఆయోధ్యకు తీసుకొచ్చారు.
ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా:
బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. రాముడి విగ్రహం ఊరేగింపుగా విచ్చేసింది. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది. బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగనున్న విషయం తెలిసిందే.
హై సెక్యూరిటీ:
అయోధ్యలోని రామజన్మభూమి భద్రతలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. డ్రోన్ దాడి నుండి రామ మందిరాన్ని రక్షించడానికి యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కూడా ఇక్కడ మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు బ్యాగ్ స్కానర్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండ్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హై కెపాసిటీ సీసీ కెమెరాలు, వెహికల్ స్కానర్ తదితరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సాంకేతిక పరికరాలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నిర్వహిస్తుంది. రామమందిర భద్రత కోసం సీఐఎస్‌ఎఫ్‌చే సెక్యూరిటీ ఆడిట్ కూడా జరిగిన విషయం తెలిసిందే. రామ మందిర భద్రత కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. రామమందిరానికి మూడంచెల భద్రత ఉంటుంది. పీఏసీతో పాటు పోలీసులు, సీఆర్పీఎఫ్‌కు చెందిన 63 బెటాలియన్లు ప్రస్తుతం రాంలాలాకు రక్షణగా ఉన్నాయి. రెడ్ జోన్ పర్యవేక్షణ CRPF చేతిలో ఉంది. అటువంటి పరిస్థితిలో, CISF మద్దతు క్యాంపస్ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.
Also Read: రోహిత్ దెబ్బకు పాండ్యా ప్యూజులౌట్.. ఇక దుకాణం సర్దుకోవాల్సిందే!
WATCH: