Shruthi Haasan: రాజకీయాల్లోకి శ్రుతి హసన్.. ఏమందంటే! కమల్ హాసన్ ముద్దుల తనయగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ ..తాజాగా రాజకీయాల్లో కి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం గురించి శ్రుతి ఇప్పటికే చాలా సార్లు స్పష్టంగా తెలిపింది. నాకు రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని ఆమె ఇప్పటికే అనేకసార్లు తెలిపింది. By Bhavana 19 Oct 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Shruthi Haasan About Her Political Entry: కమల్ హాసన్ (Kamal Haasan) ముద్దుల తనయగా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ (Shruthi Haasan) ..తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం గురించి శ్రుతి ఇప్పటికే చాలా సార్లు స్పష్టంగా తెలిపింది. నాకు రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని ఆమె ఇప్పటికే అనేకసార్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆమెకు మరోసారి ఆమె పొలిటికల్ ఎంట్రీ (Political Entry) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆమె మరోసారి స్ట్రాంగ్ గా తెలిపింది. తాజాగా శ్రుతి కోయంబత్తూర్ లో మీడియాతో మాట్లాడారు. Also read: ఏపీలో వారికి గుడ్ న్యూస్..మరికాసేపట్లో ఖాతాల్లోకి 10 వేలు! ఈ క్రమంలోనే ఆమెకు రాజకీయ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆమె '' నాకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి లేదని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల పైనే ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం శ్రుతి సలార్ సినిమాలో (Salaar Movie) నటిస్తున్నారు. ఇటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తున్న శ్రుతి బిజీబిజీగా ఉన్నారు. అంతేకాకుండా ది ఐ (The Eye) అనే భారీ హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. కథ మంచింది అయితే చిన్న పెద్ద చిత్రాలు అని చూడను అని ఆమె వివరించారు. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను ఇవ్వడమే లక్ష్యమని ఆమె తెలిపారు. తాను తమిళ అమ్మాయి కావడంతో ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు ఆమె వివరించారు. ఓ ప్రైవేట్ అల్బమ్ ని కూడా రూపొందిస్తున్నట్లు.. దాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆమె వివరించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి