Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ .. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్!

శృతి హాసన్ ఎట్టకేలకు బ్రేకప్ పై నోరు విప్పింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్‌ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ మీరు సింగిలా?లేక కమిటెడా?అని అడిగితే.." నేను ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. మింగిల్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా" క్లారిటీ ఇచ్చింది.

New Update
Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ .. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్!

Shruti Haasan On Her Breakup : శృతి హాసన్ ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ గత కొంత కాలంగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా లో ఈ ఇద్దరూ ఎన్నోసార్లు తమ ప్రేమను బయటపెట్టారు. అయితే రీసెంట్ గానే వీళ్లిద్దరికీ బ్రేకప్ అయింది. శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించగా.. ఆమె మాత్రం బ్రేకప్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఎట్టకేలకు ఈ హీరోయిన్ బ్రేకప్ పై నోరు విప్పింది.

Also Read : హేమకు మంచు విష్ణు ఊహించని షాక్.. ‘మా’ నుంచి ఔట్?

ప్రెజెంట్ నేను సింగిల్

శృతి హాసన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్‌ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ మీరు సింగిలా?లేక కమిటెడా?అని అడిగాడు. అందుకు శృతి హాసన్ బదులిస్తూ.. " ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వడం నాకు సంతోషం అనిపించదు. కానీ నేను ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. మింగిల్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నా. అందులోనే నేను ఆనందంగా ఉన్నా. ప్రస్తుతానికైతే నాకు ఇది చాలు" అంటూ ఆ నెటిజన్ కి రిప్లై ఇచ్చింది. ఈ రిప్లై తో శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాకు బ్రేకప్ అయినట్లు క్లారిటీ ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు