బ్లడ్ కారేదాకా వదలలేదు.. షూటింగ్ తర్వాత సర్జరీ చేయించుకున్నా : శ్రియారెడ్డి

'సలార్' మూవీ కోసం చాలా స్ట్రగుల్ అయ్యానని శ్రియారెడ్డి చెప్పింది. 'రాధారమ' పాత్ర కోసం బరువైన చెవిపోగులు ధరించడంతో చెవులు కోసుకుపోయాయని, బ్లడ్ కారుతున్న వాటిని తొలగించకుండా కొనసాగించానని తెలిపింది. అయితే షూగింట్ తర్వాత సర్జీరీ చేయించుకున్నట్లు వెల్లడించింది.

బ్లడ్ కారేదాకా వదలలేదు.. షూటింగ్ తర్వాత సర్జరీ చేయించుకున్నా : శ్రియారెడ్డి
New Update

Shriya Reddy : యంగ్ బ్యూటీ శ్రియారెడ్డి 'సలార్' (Salaar) మూవీ షూటింగ్ టైమ్ లో ఎదుర్కొన్న స్ట్రగుల్ పై ఓపెన్ అయింది. ప్రభాస్ హృరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ పలు చోట్ల సక్సెస్ మీట్ లు నిర్వహిస్తుండగా.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియారెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘సలార్‌’ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తే ఆనందంగా ఉంది. నేను పోషించిన క్యారెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్. బోట్టు, కట్టు వేషాధారణలో నన్ను నేనే నమ్మలేకపోయా. ముఖ్యంగా ప్రశాంత్‌ నీల్‌ చిత్రాల్లో కాస్ట్యూమ్స్‌ డార్క్ కలర్స్‌లోనే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘సలార్‌’లోనూ బ్లాక్‌, గ్రే, ఆలీవ్‌ గ్రీన్‌.. వంటి రంగులనే ఎక్కువగా వాడారు. ఓ సన్నివేశంలో పసుపు రంగు చీర ధరిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఇదే విషయాన్ని ప్రశాంత్‌కు చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. ఆయనతో గొడవపడి మరీ, ఆ రంగు చీర ధరించా. సినిమా మొత్తంలో ఆ సీన్‌లోనే కాస్త విభిన్నమైన కలర్‌ కనిపిస్తుంది' అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : ‘యానిమల్’లో శృతిమించిన శృంగారం.. విమర్శలపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ రిప్లై

అలాగే తను ఎదుర్కొన్న స్ట్రగుల్ గురించి మాట్లాడుతూ.. 'రాధారమ' పాత్ర కోసం తాను చాలా బరువైన చెవిపోగులు ధరించానని.. షూట్‌లో భాగంగా ఎక్కువసేపు వాటిని పెట్టుకోవడం వల్ల చెవులు తెగాయని ఆమె వెల్లడించారు. సినిమాలో తాను ధరించిన ఆ పోగుల వల్ల చేవులు సాగిపోయాయని, కొన్నిసార్లు బ్లడ్ కారిపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డానని చెప్పింది. అంతేకాదు షూటింగ్ ముగిసిన తర్వాత సర్జరీ చేయించుకున్నానని చెప్పడం విశేషం. కాగా ప్రస్తుతం శ్రియా రెడ్డి వ్యా్‌ఖ్యలు వైరల్ అవుతున్నాయి.

#shriya-reddy #salaar #struggle
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe