US: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..వారంలో మూడో కేసు!

అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్థిమృతి చెందాడు. ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల భారత కాన్సులేట్‌ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

US: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..వారంలో మూడో కేసు!
New Update

Indian Student Death in US: అగ్రరాజ్యం లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. కేవలం వారం వ్యవధిలో ముగ్గురు భారతీయ విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని ఒహియోలోని సిన్సినాటిలో శ్రేయాస్‌ రెడ్డి (Shreyas Reddy) అనే భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు తెలిసింది.

అయితే విద్యార్థి మృతి చెందాడనికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. శ్రేయాస్‌ లిండర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (Lindner School of Business) విద్యార్థి అని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ ఈ ఘటన గురించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అంతేకాకుండా వారికి అన్ని విధాల సహాయపడతామని హామీ ఇచ్చింది.

"ఒహియోలో (Ohio) భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి (Shreyas Reddy) బెనిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల భారత కాన్సులేట్‌ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వారంలోనే వివేక్‌ సైనీ (Vivek Saini), నీల్‌ ఆచార్య (Neel Acharya) అనే భారతీయ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. జనవరి 30న, పర్డ్యూ యూనివర్శిటీలో ఆచార్య అనే విద్యార్థి చనిపోయాడని, టిప్పెకానో కౌంటీ కరోనర్ తెలిపారు. టిప్పెకానో కౌంటీ కరోనర్ ఆఫీస్ ప్రకారం, అధికారులు పర్డ్యూ క్యాంపస్‌ లో విద్యార్థి మృతి చెందినట్లు కనుగొన్నారు.

విద్యార్థి మృతి పై అనుమానాలున్నాయంటూ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య అతనిని పర్డ్యూ యూనివర్సిటీలో డ్రాప్ చేసిన ఉబెర్ డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతని గురించి వెదకడం ప్రారంభించారు. అతని గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఇదిలా ఉంటే జనవరి 29న ఆశ్రయం కల్పించిన భారతీయ విద్యార్థినే ఓ వ్యక్తి సుత్తితో కొట్టడం వల్ల విద్యార్థి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన విద్యార్థిని వివేక్‌ సైనీ గా అధికారులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైనీ మృతదేహాన్ని భారత్‌ కు పంపాడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.

ఏది ఏమైనప్పటికీ అగ్ర రాజ్యంలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను కంగారు పెడుతున్నాయి.

Also Read: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్‌!

#indian-student #murder #america
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి