Stree 2 Movie : బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' జోరు.. 'KGF 2' రికార్డ్ బ్రేక్

బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా 'KGF 2' రికార్డును బ్రేక్ చేసింది. 'కేజీఎఫ్‌ 2' హిందీ వెర్షన్‌ రూ.435 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. 'స్త్రీ 2' రూ.442 కోట్ల వసూళ్లు రాబట్టింది.

New Update
Stree 2 Movie : బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' జోరు.. 'KGF 2' రికార్డ్ బ్రేక్

Stree 2 Movie : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన హర్రర్ మూవీ'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ తో ఫైటర్‌, కల్కి సినిమాల కలెక్షన్స్ ను అధిగమించిన ఈ మూవీ తాజాగా 'KGF 2' రికార్డును బ్రేక్ చేసింది. 'కేజీఎఫ్‌ 2' హిందీ వెర్షన్‌ రూ.435 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. 'స్త్రీ 2' రూ.442 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Also Read : రాజమౌళితో సినిమా నిజమే.. కానీ : చియాన్ విక్రమ్

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు చూస్తుంటే యానిమల్‌, పఠాన్‌, గాదర్ 2 వంటి సినిమాల లైఫ్‌ టైం కలెక్షన్స్ ను సైతం ఈజీగా అధిగమించే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 'స్త్రీ' యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాను అమర్‌ కౌశిక్ డైరెక్ట్ చేశారు. రాజ్ కుమార్ రావ్ పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisment
తాజా కథనాలు