PresVu Eye Drop: రీడింగ్ గ్లాసెస్‌కు బదులు ప్రెస్వూ ఐ డ్రాప్స్..నిజంగానే పని చేస్తున్నాయా?

రీడింగ్ గ్లాసెస్ కు బదులు ఐడ్రాప్స్ వేసుకుంటే చాలు అంటోంది ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్. దీనికి సంబంధించి ముంబైలో మొట్టమొదట సారిగా రీడింగ్ గ్లాసెస్‌లా పని చేసే ప్రెస్వ్యూ ఐ డ్రాప్స్‌ను ప్రారంభించింది. మరి దీని ప్రభావం ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..

PresVu Eye Drop: రీడింగ్ గ్లాసెస్‌కు బదులు ప్రెస్వూ ఐ డ్రాప్స్..నిజంగానే పని చేస్తున్నాయా?
New Update

చాలా ప్రయోగాల అనంతరం ముంబైలోని ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ఒక కొత్త కంటి చుక్కలు ప్రెస్వ్యూ అందుబాటులోకి తీసుకువచ్చింది. రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండా ఐ డ్రాప్స్ ద్వారా కంటి చూపును మెరుగుపర్చుకోవచ్చని చెబుతోంది. 270 మంది రోగుల మీద ప్రయోగం చేసామని...మూడు దశల్లో క్లినికల్ టెస్ట్‌లు చేసి సక్సెస్ అయ్యామని తెలిపింది. ఇది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం కూడా పొందిందని చెప్పింది. అక్టోబర్ నుంచి ఈ కంటి చుక్కల మందు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నిఖిల్ K మసుర్కర్. రీడింగ్ గ్లాసెస్‌ను ఈ మందు పూర్తిగా తొలగిస్తుందని అంటున్నారు. అయితే దీనిని డాక్టర్లు రికమెండ్ చేశాకనే వాడాలని సూచించారు.

కంటి డాక్టర్లు ఏమంటున్నారు...

కొత్తగా వస్తున్న ఈ ఐడ్రాప్స్ దీర్ఘకాలంలో పనిచేయవని చెబుతున్నారు కంటి నిపుణులు. ఐడ్రాప్స్ స్టాప్–గ్యాప్ పరిష్కారాన్ని మాత్రమే ఇస్తామని పూర్తిగా కంట సమస్యలను నివారించలేవని చెబుతున్నారు. అంటే కంటి చుక్కలు వేసుకుంటే కొన్ని రోజులు కళ్ళు బాగానే పని చేస్తాయి కానీ మళ్ళీ తర్వాత రీడింగ్ గ్లాసెస్ పెట్టుకోవాల్సిందేనని అంటున్నారు. ఇదేమీ జీవితకాల పరిష్కాం లేదా అద్​బుత నివారణ కాదని తేల్చి చెప్పేశారు.

ప్రెస్వ్యూ ఎలా పని చేస్తుంది..

ఈ ఐ డ్రాప్స్‌ను పైలో కార్పైన్ అనే దానితో తయారు చేశారు. 75 ఏళ్ళుగా దీన్ని గ్లాకోమా చికిత్సలో వాడుతున్నారు. ఇది వస్తువులను దగ్గరగా చూడ్డానికి ఉపయోగపడుతుంది. కళ్ళల్లో ఉండే ప్రెస్బియోపియా అనే పార్ట్‌కు చికిత్సచేస్తుంది. ఈ ప్రెస్బియోపియా మనుషుల్లో వయసు పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. సాధారణంగా 40 ఏళ్ళు వచ్చాక ఇది పని చేసే సామర్ధ్యం తగ్గుతుంది. 60లు వచ్చేసరికి ఇది మరింత తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు ప్రెస్వ్యూ ఐ డ్రాప్స్ ప్రెస్బియోపియా సామర్ధ్యాన్ని మరికొన్నాళ్ళు పెరిగేలా చేస్తుంది. అంతే కానీ పూర్తిగా పని చేసేలా చేయలేదు. ఏదైనా సరే వయసు పెరుగుతున్న కొద్దీ క్షీణించాల్సిందే అంటున్నారు కంటినిపుణులు. విదేశాలలో ప్రెస్బియోపియా చికిత్స కోసం కొన్ని మందులు ఉన్నాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA)చే ఆమోదించబడిన Orasis Pharmaceuticals' Qlosi, AbbVie's VUITY. 2021లో, VUITY అనేది ప్రపంచంలో ప్రెస్బియోపియాకు చికిత్స చేయడానికి FDA- ఆమోదించబడిన మొదటి మందు అని చెబుతున్నారు డాక్టర్లు.

ఐ డ్రాప్స్ వేసుకున్నాక 15 నిమిషాల్లో పని చేయడం ప్రారంభిస్తుంది. దాని ప్రభావం ఆరు గంటలు ఉంటుంది. ఆ తరువాత మళ్ళీ డ్రాప్స్ వేసుకోవాల్సిందే. అందుకే ఈ ప్రెస్వ్యూ డ్రాప్స్ స్వల్పకాలానికి మంచివే కానీ దీర్ఘకాలానికి పనికి రావని న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్ నుండి డాక్టర్ రోహిత్ సక్సేనాలు చెప్పారు. దూరృష్టి, తలనొప్పి, రెటీనా సమస్యలు ఉన్నవాళ్ళకు ఈ మందు పని చేయదు. అలాంటి వాళ్ళకు కళ్ళజోడే మంచిది అంటున్నారు. ఈ ఐ డ్రాప్స్ కొంతకాలం పాటూ కళ్ళల్లోని కండరాలు బాగా పని చేయడానికి దోహదపడతాయి. కానీ కళ్ళల్లో ఉండే కండరాలు కొంతకాలానికి అలిసి పోతాయి. బలవంతంగా అవి మాత్రం ఎంతకాలం పని చేస్తాయి అంటున్నారు గురుగ్రామ్‌లోని నారాయణ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఆప్తాల్మాలజీ విభాగాధిపతి డాక్టర్ దిగ్విజయ్ సింగ్. క్లినికల్ ట్రయల్స్‌లో మెడిసిన్‌ల విజయం కేవలం సగం యుద్ధం మాత్రమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కంటి చుక్కలు రోజువారీ వినియోగానికి ఉపయోగపడతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలని చెప్పారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe