Hinduism Tips : హిందూ మతంలో జ్యోతిష్యానికి(Astrology) ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిని చేయడం లేదా చేయకపోవడం ద్వారా ప్రభావం జీవితంలో కనిపిస్తుంది. అయినప్పటికీ, ప్రజలు తరచుగా గందరగోళంలో ఉండే కొన్ని అపోహలు ఉన్నాయి. సూర్యాస్తమయం(Sunset) తర్వాత ఇంటి గుమ్మం మీద కూర్చోవాలా వద్దా అనే అపోహ కూడా చాలా మంది లో ఉంది. తుడుచుకోవాలా వద్దా? సాయంత్రం పూట తులసికి నీళ్ళు సమర్పించాలా వద్దా? అనే ప్రశ్నలపై జ్యోతిష్కులు ఏం చెబుతున్నారు.
హిందూ మతంలో సూర్యాస్తమయం తర్వాత అనేక పనులు నిషేధించారు. సనాతన ధర్మంలో, సూర్యుడిని దేవతగా పరిగణిస్తారు, అందుకే సూర్యోదయం, సూర్యాస్తమయం గురించి కొన్ని నియమాలు గ్రంథాలలో ఇవ్వబడ్డాయి. ఈ విషయాలను విస్మరించడం అశుభం. సూర్యోదయం తర్వాత ఇలాంటి పనులు చేయకూడదని చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు.
ఇంటి గుమ్మంలో కూర్చోవద్దు: సాయంత్రం ఇంటి గుమ్మం మీద ఎవరూ కూర్చోకూడదు. సూర్యాస్తమయం తర్వాత గుమ్మంలో కూర్చోవడం అశుభం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదని నమ్ముతారు. పొరపాటున కూడా సాయంత్రం మెట్లపై కూర్చోవద్దు. అలాగే, సాయంత్రం తలుపు కూడా తెరిచి ఉంచాలి.
సూర్యాస్తమయం తర్వాత నిద్రపోకండి: ఒక వ్యక్తి సాయంత్రం నిద్రిస్తే, అతను అనేక వ్యాధుల బారిన పడతాడని నమ్ముతారు. అంతేకాకుండా సాయంత్రం పూట నిద్రించే(Evening Sleep) వ్యక్తి జీవితకాలం కూడా తక్కువే. అటువంటి పరిస్థితిలో, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. ఇలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు.
ఊడ్చవద్దు: హిందూ మతం(Hinduism) లో, సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఇంటి లోపల స్వీప్(Sweep) చేయరు. సాయంత్రం వేళ ఇంటిని ఊడ్చడం వల్ల మలినాలు వస్తాయని, లక్ష్మీదేవికి కోపం వస్తుందని, అందుకే సాయంత్రం పూట ఊడ్చకూడదని నమ్ముతారు.
తులసికి నీరు సమర్పించవద్దు:సాయంత్రం పూట తులసికి నీరు సమర్పించకూడదు. అలాగే ఈ సమయంలో తులసి ఆకులను తీయకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్ముతారు.
డబ్బు లావాదేవీలను నివారించండి: హిందూ మతం విశ్వాసాల ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా డబ్బు లావాదేవీలు(Money Transactions) చేయకూడదు. సాయంత్రం లావాదేవీ చేసిన డబ్బు తిరిగి రాదని నమ్ముతారు.
Also Read : లవ్ ఫీవర్ ను గుర్తించండి ఇలా?