Mexico Bar Shooting: మెక్సికోలోని ఓ బార్‌లో కాల్పులు..ఆరుగురు మృతి!! By Bhoomi 17 Sep 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మెక్సికోలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP శనివారం తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి బార్‌లో ప్రజలు గుమిగూడారని, కాల్పుల ఘటన జరిగి ఆరుగురు మరణించారని వార్తా సంస్థ AFP నివేదించింది. ఈ ప్రాంతం గత కొన్నేళ్లుగా గ్యాంగ్ హింసకు గురవుతోంది. మెక్సికన్ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి టియోకల్టిచే నగరంలో ఈ సంఘటన జరిగిందని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. మారవిల్లాస్ పరిసరాల్లోని ఓ బార్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు వ్యక్తులు కాల్పులు జరిపారని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.తొలుత నలుగురు చనిపోయారని, అయితే ఆ తర్వాత ఆరుగురు మరణించారని ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. ఈ కాల్పుల ఘటనతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల ప్రారంభంలో, జాలిస్కోలోని టియోకల్టిచేలో కాల్పుల సంఘటన జరిగింది. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు చనిపోయారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో కుప్పకూలిన విమానం…14మంది దుర్మరణం..!! ఫెడరల్ ప్రభుత్వం 2006లో మిలిటరీ మద్దతుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించిందని, దాని నుండి 3,40,000 కంటే ఎక్కువ హత్యలు, దాదాపు 1,00,000 మంది ప్రజలు తప్పిపోయినట్లు నివేధించింది. అటు బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం ఓ విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో 14 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మేయర్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ ఘటనపై అమెజాన్ గవర్నర్ విల్సన్ లిమా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. “శనివారం బార్సిలోనాలో జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను” అని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది కూడా చదవండి: జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి..!! అవసరమైన సహాయం అందించేందుకు మా బృందాలు పని చేయడం ప్రారంభించాయని అమెజాన్ గవర్నర్ తెలిపారు. ” మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, ప్రార్థనలు తెలియజేస్తున్నానని ” అని అతను చెప్పారు. మరోవైపు మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్స్ కూడా ఈ ఘటనను ధృవీకరించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి గురించి ఇంకా సమాచారం లేదు. #mexico-bar-shooting #bar-shooting #jalisco #mexico-shooting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి