Mumbai: ముంబై రైల్వేస్టేషన్ లో ఏం జరిగింది? ఆ వ్యక్తి ప్రాణం ఎలా పోయింది? ఒక్కోసారి క్షణికావేశంలో చేసే పొరపాట్లు కారణంగా ప్రాణాలు కూడా పోతుంటాయి. దంపతులు చేసిన చిన్న పొరపాటుకు ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో సియోన్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. By BalaMurali Krishna 18 Aug 2023 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన.. ముంబైలోని సియోన్ రైల్వే స్టేషన్‌లో (Mumbai Sion railway station) షాకింగ్ ఘటన జరిగింది. రైలు కోసం దంపతులు ఎదురుచూస్తున్న సమయంలో ఓ వ్యక్తి చూసుకోకుండా భార్యను ఢీకొట్టాడు. దీంతో ఆమె కోపంగా ఆ వ్యక్తిని గొడుగుతో పదే పదే కొట్టగా.. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమె భర్త సైతం చేయి చేసుకుకోవడంతో బ్యాలెన్స్ కోల్పోయిన అతడు రైలు పట్టాలపై పడిపోయాడు. దురదృష్టవశాత్తు అదే సమయంలో రైలు రావడంతో చక్రాల కింద నలిగి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన CCTV కెమెరాల్లో రికార్డు అయింది. గురువారం రాత్రి ఈ హృదయ విదారక ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. Your browser does not support the video tag. షాక్‌కు గురైన ప్రయాణికులు.. శీతల్ అనే మహిళ తన భర్తలో స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దినేష్ అనే 26 ఏళ్ల యువకుడు పొరపాటున ఆమెను ఢీకొట్టాడు. కోపంతో ఊగిపోయిన శీతల్ తన వద్ద ఉన్న గొడుగుతో కొట్టింది. అదే సమంలో ఆమె భర్త కూడా కలుగజేసుకుని అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో దీనేష్ రైలు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో రైలు వస్తుండడంతో తోటి ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రైలు వెళ్లడంతో అతడు స్పాట్‌లోనే మృతిచెందాడు. ఈ షాకింగ్ ఘటనలో అక్కడ ఉన్న ప్రయాణికులందరూ షాక్‌కు గురయ్యారు. మొత్తానికి క్షణికావేశంలో చేసిన ఓ పొరపాటు కారణంగా ఓ యువకుడి నిండు జీవితం బలైపోయింది. యువకుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: ఇద్దరి ప్రాణం తీసిన రెండు కుక్కల గొడవ #mumbai #mumbai-sion-railway-station #mumbai-man-crushed-under-train #man-falls-on-tracks #shocking-incident-at-sion-railway-station #sion-railway-station-incident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి