Drugs: గంజాయి గురించి అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. సూసైడ్‌కు లింక్?

గంజాయి వినియోగం వల్ల జంక్ ఫుడ్ కోరికలు, గణనీయంగా బరువు పెరగడం, ఆందోళన, భయభ్రాంతులు కలగడం లాంటివి ఎక్కువ అవుతున్నాయని ఓ స్టడిలో తెలింది. నొప్పి నుంచి ఉపశమనం గంజాయిని తీసుకునేవారికి ఈ విషయం ఓ హెచ్చరికగా మారింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Drugs: గంజాయి గురించి అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. సూసైడ్‌కు లింక్?

Drugs: గంజాయి వినియోగాన్ని, పెంపకాన్ని ప్రభుత్వాలు నిషేదించాయి. కానీ కొందరు గంజాయిని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తారు. అయితే తెలుసో.. తెలియకో.. మత్తు కావాలనుకునేవారు ఈ గంజాయిని ఉపయోగించి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారని తాజా అధ్యయనం తెలిపింది. ఔషధ గుణాలు కలిగిన గంజాయి దీర్ఘకాలిక నొప్పి నుంచి ఉపశమనం, నాణ్యమైన జీవిత ప్రయోజనాలను అందిస్తుందని పలు అధ్యయనాలు సూచించాయి. కానీ దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణాంతక సమస్యలు కూడా కలుగుతాయని తెలిపాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి కొందరు విచ్చలవిడిగా గంజాయి వినియోగిస్తున్నారు. అలాంటివారికి తాజా అధ్యయనం షాక్ ఇచ్చింది. గంజాయి ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అధ్యయనంలో ఏమి తేలిందంటే..

ఈ అధ్యయనం గురించి సైకియాట్రీ రీసెర్చ్ కేస్ రిపోర్ట్స్ జర్నర్​లో ప్రచురించారు. ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్న, స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్​తో 27 ఏళ్ల మహిళ దీర్ఘకాలిక నొప్పితో కూడిన నాడీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుంది. ఈ సమస్యపై పరిశోధకులు స్టడీ చేశారు. అయితే ఈ మహిళ తన నొప్పిని తగ్గించుకునేందుకు గంజాయి తీసుకునేది. ఈ డోస్ రోజు రోజుకి పెరిగిపోవడంతో పరిస్థితి విషమించింది. మెంటల్​గా డిస్టర్బై.. తీవ్ర అలసట, నిద్ర సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు, తీవ్రమైన మానసిక ఇబ్బందులతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ సైకోసిస్​లో భాగమేనని చెప్తున్నారు.

మరణం తప్పదట:

అనంతరం వైద్యులు ఆమెతో గంజాయిని మానిపించేశారు. అప్పుడు ఆమెలోని మానసిక లక్షణాలు సరికావడం, జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదల రావడం గుర్తించారు. ఒకవేళ ముందు మాదిరిగానే గంజాయి ఉపయోగిస్తే సమస్య మరింత తీవ్రమయ్యేదని చెప్తున్నారు. గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలియక చాలామంది దీనిని ఎక్కువగా వినియోగించడం మొదలు పెడుతున్నారని.. మోతాదుకు మించి తీసుకుంటే మరణం తప్పదని చెప్తున్నారు. అయినా కొందరు అవిజ్ఞానంతో దీనిని దుర్వినియోగం చేస్తే.. మరికొందరు పలు రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు దీనిని ఎక్కువగా వినియోగించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నట్లు తెలిపింది.

మానసిక ప్రభావాలుః

ఫైబ్రోమైయాల్జియా వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో గ్లుటామేట్ అత్యంత ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. వైద్యుల సూచనలు డైట్ ఫాలో అయితే సమస్య త్వరగా తగ్గుతుందని.. కానీ గంజాయి వినియోగంతో పరిస్థితి చేజారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే శారీరకంగానే కాకుండా గంజాయి మానసికంగా కూడా పరిస్థితిని దిగజార్చుతుందని చెప్తున్నారు. మానసిక ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు, నొప్పిలో పెరుగుదల, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని వెల్లడించారు.

గంజాయి వినియోగం వల్ల జంక్ ఫుడ్ కోరికలు, గణనీయంగా బరువు పెరగడం, ఆందోళన, భయభ్రాంతులు కలగడం వంటి కూడా ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. అయితే ప్రస్తుత అధ్యయనం నొప్పి నుంచి ఉపశమనం గంజాయిని తీసుకునేవారికి హెచ్చరికగా మారింది. దీర్ఘకాలిక నొప్పి చికిత్సలో గంజాయి ఉపశమనం ఇస్తుంది కానీ.. మోతాదుకి మించి తీసుకుంటే సమస్య తీవ్రమై.. ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా సైకోసిస్ అనే మానసిక ఆరోగ్యానికి గురించేస్తుందని మానసిక వైద్యులు చెప్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  సబ్జా గింజల్లో అద్భుత పోషకాలు.. ఇలా తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం

Advertisment
తాజా కథనాలు