మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కు షాక్.. రంగంలోకి ఈసీ ! ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారంటూ అడ్వకేట్ రామారావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, భార్య వాణి, కుమారుడు రోహిత్ పై ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుతో తెలంగాణ ఈసీ అధికారి రంగంలోకి దిగింది. By Bhoomi 16 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారంటూ అడ్వకేట్ రామారావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, భార్య వాణి, కుమారుడు రోహిత్ పై ఫిర్యాదు చేశారు. 2017లో జరిగిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తి విలువ రూ. 3కోట్లుగా, ఆయన భార్య వాణి ఆస్తి సుమారు రూ. 50లక్షలుగా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ. 20కోట్ల విలువైన 18 విదేశీ కార్లు, కోట్ల విలువ చేసే అరబ్ గుర్రాలు, విదేశీ పెంపుడు కుక్కలు, సొంత ఫ్లైట్స్ రోహిత్ కు ఉన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధి అయిన మైనంపల్లి కుటుంబానికి చెందిన వేల కోట్ల ఆస్తులపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని లోకాయుక్తను అడ్వకేట్ రామారావు కోరారు. రోహిత్ తన తల్లి వాణితో కలసి శివ శక్తి రియాల్టర్స్ ఎల్ ఎల్ పి 2021 లో కేవలం రెండు లక్షల పెట్టుబడితో స్థాపించారని..రెండు లక్షల పెట్టుబడితో వేల శాతం లాభాలు ఎలా గడించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్వకేట్ ఫిర్యాదుతో రంగంలోకి దిగింది తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషన్. మైనంపల్లి ప్రమాణ పత్రాల పై వివరణ కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నివేదిక కోరుతూ అధికారిక మెమో 9010/Elecs. D/A /2023-1 జారీ చేశారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి. ఫిర్యాదు లో పేర్కొన్న ఆధారాలను నిర్ధారణ చేసి నివేదిక సమర్పిచవల్సిందిగా రిటర్నింగ్ ఆఫీసర్ను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఇది కూడా చదవండి: ఈ ఫోన్ బ్యాటరీ టైం పెరగాలంటే..ఈ టిప్స్ పాటించండి..!! #telangana-election-2023 #mainampally-hanmantha-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి