/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-4-jpg.webp)
చంద్రబాబు ముందస్తు బెయిల్ (Chandrababu Bail) పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Coiurt) వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 30కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అప్పటివరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోనూ (AP Skill Scam) ఇదే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పును దీపావళి సెలవుల అనంతరం వెలువరిస్తామని తెలిపింది.
ఇది కూడా చదవండి: AP Politics: టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం
దీపావళి సెలవుల తర్వాత పాత అర్డర్ ప్రకారం తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం చంద్రబాబునాయుడుకు ఆరోగ్య సమస్యల రీత్యా ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇటీవల చంద్రబాబు కంటి ఆపరేషన్ ను హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ అస్పత్రిలో చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: రివర్స్ అటాక్.. జగన్ అక్రమాస్తుల కేసులపై ప్రతిపక్షాలు ఫోకస్..
అయితే బెయిల్ గడువు ముగిసేలోపు సుప్రీంకోర్టులో ఊరట వచ్చే అవకాశం ఉందని టీడీపీ, చంద్రబాబు అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. అయితే.. చంద్రబాబు బెయిల్ గడువు ఈ నెల 28తో ముగియనుంది.
ఈ వీడియో కూడా చూడండి: