YS Sunitha: వైఎస్ సునీతకు షాకిచ్చిన పులివెందుల గ్రామస్తులు

AP: పులివెందుల మండలం రంగాపురంలో పర్యటించిన సునీతకు షాక్ తగిలింది. ఆమె వివేకా హత్య గురించి మాట్లాడుతుండగా.. అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు.. ఆ విషయాన్ని మాట్లాడొద్దని హెచ్చరించారు. తనకు అన్యాయం జరిగిందని.. తప్పకుండా మాట్లాడుతానని గ్రామస్తులతో ఆమె వాగ్వాదానికి దిగారు.

YS Sunitha : వైఎస్ భారతి నన్ను నరికేస్తుంది.. సునీత సంచలన వ్యాఖ్యలు
New Update

YS Sunitha: కడప ఎంపీ రేసులో ఉన్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను గెలిపించాలంటూ వైఎస్ వివేకా కూతురు సునీత ఎన్నికల ప్రచారం చేపట్టింది. ఈ క్రమంలో పులివెందుల మండలంలో పర్యటించిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈరోజు పులివెందుల మండలం పెద్ద రంగాపురంలో పర్యటించారు. సునీత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతుండగా ఆ కేసు విషయం మాట్లాడొద్దు అని అక్కడి గ్రామస్తులు హెచ్చరించారు.

ALSO READ: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వివేకా హత్య గురించి ఎందుకు మాట్లాడొద్దు అని సునీత ఆ గ్రామస్థులతో వాగ్వాదానికి దిగింది. తనకు అన్యాయం జరిగిందని సునీత ఆవేదన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా మాట్లాడుతానని మీ ఇంట్లో అన్యాయం జరిగితే మీరు మాట్లాడారా అని గ్రామస్థులను ప్రశ్నించింది. గొడవ పడుతున్న వ్యక్తి ని పోలీసులు అక్కడ నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.

వివేకా హత్య గురించి మాట్లాడొద్దు: కోర్టు ఆదేశాలు 

వైఎస్ వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆంక్షలు పెట్టింది. కాగా ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై ప్రధాన పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కడప వైసీపీ అధ్యక్షుడు సురేష్‌ బాబు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్యపై మాట్లాడొద్దంటూ వై.ఎస్.షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ లకు కోర్టు సూచనలు చేసింది. 

#ys-sunitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి