వైసీపీకి షాక్..మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు రాజీనామా

సీఎం జగన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమంటూ వేడుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. బాధగా ఉందని పంచకర్ల రమేష్‌బాబు లేఖలో వెల్లడించారు.

New Update
 వైసీపీకి షాక్..మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు రాజీనామా

బైబై వైసీపీ.. బాధగా ఉంది

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా విషయమై పంచకర్ల రమేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమంటూ వేడుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. బాధగా ఉందన్నారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టి కి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించినట్టు తెలిపారు. కానీ వీలు కాలేదన్నారు. ప్రజా సమస్యలు, కింది స్థాయిలో తీర్చ లేనప్పుడు ఈ పదవిలో ఉండటం, సమంజసం కాదని రాజీనామా చేస్తున్నానన్నారు. అధ్యక్షుడు అంటే స్వేచ్ఛయుత పరిస్థితులు ఇవ్వలేదన్నారు. చాలా వరకు ఘాటుగా విమర్శించడం తనకు రాదన్నారు. సామాజిక వర్గ మీటింగ్‌లు పెట్టొద్దని పార్టీ ఆదేశించిందన్నారు. తనకూ సుబ్బారెడ్డితో ఎలాంటి విభేదాలూ లేవన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశమై... భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటానని రమేష్‌బాబు తెలిపారు.

Shock for YCP..Former MLA Panchkarla Rameshbabu resignation

పయనం ఎటు ఉంటుందో..?

అయితే పంచకర్ల రమేష్‌బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం రమేష్‌బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటు టీడీపీలో చేరారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆగస్ట్ 2020లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక ప్రస్తుతం వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఇక మీదట ఆయన పయనం ఎటు ఉంటుందో చూడాలి.

Shock for YCP..Former MLA Panchkarla Rameshbabu resignation

ముఖ్య నాయకత్వంతో చర్చించి భవిష్యత్‌పై నిర్ణయం

వైసీపీ హైకమాండ్ ఆహ్వానం మేరకే నేను అధికార పార్టీలో చేరానని ఈ సందర్భంగా రమేష్ బాబు పేర్కొన్నారు. అయితే.. హై కమాండ్‌ను ఒప్పించలేనందుకు క్షమించండని…చాలా ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఉద్వేగానికి లోనైన పంచకర్ల రమేష్‌బాబు తాను వైసీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. భవిష్యత్ ప్రణాళిక చేసుకుని రాజీనామా చేయలేదని…ముఖ్య నాయకత్వంతో చర్చించుకుని భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని ఆయన వివరించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు