Indian Students Deported : తెలుగు విద్యార్థులకు షాక్..21మంది వెనక్కు పంపిన అమెరికా..!!

అమెరికాలో తెలుగు విద్యార్థులకు చుక్కెదురైంది. 21మంది భారతీయ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కు పంపించారు. అగ్రరాజ్యంలో పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను సరైన పత్రాలు లేవన్న కారణంతో వారిని వెనక్కు పంపించారు.

New Update
Indian Students Deported : తెలుగు విద్యార్థులకు షాక్..21మంది వెనక్కు పంపిన అమెరికా..!!

Indian Students Deported  : ఉన్నత చదువుల కోసం అమెరికాకు (US) వెళ్లిన భారతీయ విద్యార్థులకు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికాకు వెళ్లిన 21మంది విద్యార్థులను వెనక్కి పంపించింది. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో చదివేందుకు అక్కడికి వెళ్లారు. వారిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పలు పత్రాలు సక్రమంగా లేవన్న కారణంతో వారిని వెనక్కు పంపించినట్లు తెలుస్తోంది. రిటర్న్ ఫ్లైట్స్ లో ఎక్కించారు. అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్ పోర్టుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇలా వెనక్కు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండటం గమనార్హం. ఎయిర్ పోర్టులకు చేరుకున్న తర్వాత సాధారణ తనిఖీల్లో భాగంగా కొంతమందిపై అనుమానంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు (US immigration officials) వారిని ఆరా తీశారు. విద్యార్థులకు ప్రవేశాలు దక్కిన వర్సిటీల్లోని ఫీజులతోపాటు విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను కూడా అధికారులు పరిశీలించారు. అంతేకాదు మొబైళ్లు, మెయిల్స్, కన్సల్టెన్సీలు, అమెరికాలోని విద్యార్థులతో సంభాషణలను లోతుగా పరిశీలించారు. ఆ తర్వాతే వారిని వెనక్కు పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్ అయిన స్టూడెంట్స్ తిరిగి ఐదేళ్ల దాకా ఆ దేశ విసాకు అప్లై చేసుకునేందుకు అర్హత కోల్పోతారు. తమ పిల్లలను వెనక్కి పంపించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్..రూ. 1470కే దుబాయ్, యూరప్ వెళ్లే ఛాన్స్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు