MLC Kavitha: కవితకు మరో షాక్.. బెయిల్‌పై విచారణ వాయిదా

సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22 లేదా 23న కవిత బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

New Update
MLC Kavitha: కవితకు మరో షాక్.. బెయిల్‌పై విచారణ వాయిదా

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22 లేదా 23న కవిత బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: యూపీఎస్సీ ఫలితాల విడుదల

23  వరకు సీబీఐ కస్టడీ..

సీబీఐ కస్టడీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన  రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) ఆమెకు మళ్ళీ వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధిస్తూ ఆదేవాలు జారీ చేసింది. అంతకుముందు విధించిన మూడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఈరోజు కొంత సమయం క్రితం సీబీఐ కోర్టు(CBI Court) లో హాజరుపర్చింది. ఈ మూడ్రోజుల కస్టడీలో కవితను సుదీర్ఘంగా విచారించారు అధికారులు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించలేదని సీబీఐ కోర్టులో చెప్పింది.  ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది.  సీబీఐ మరో 14 రోజుల కస్టడీ అడగ్గా కోర్టు మాత్రం తొమ్మిది రోజులు మాత్రమే ఇచ్చింది. మరోవైపై  కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఇక నిన్న కవితను అన్న కేటీఆర్(KTR) కలిశారు. కేసు విషయంలో కాసేపు చర్చించారు. కోర్టు తీర్పు తర్వాత సీబీఐ అధికారులు కవితను మళ్ళీ తీహార్‌ జైలుకు తరలించారు. 

Advertisment
తాజా కథనాలు