Chicken: చికెన్ ప్రియులకు షాక్.. కొండెక్కిన చికెన్ ధరలు..!

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300కు పైగా పలుకుతోంది. ఎండ తీవ్రత కారణంగా ఫ్రౌల్టీలలోని కోళ్లు మృత్యువాత పడుతుండడంతో వ్యాపారస్తులు రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. నెలలోనే చికెన్ రూ.100 పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

New Update
Meat Shops: హైదరాబాద్ వాసులకు షాక్.. చికెన్, మటన్ షాపులు బంద్!

Chicken Price Increased: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. చికెన్ ధరలు ఏకంగా రూ.100 పెరిగాయి. దీంతో సామాన్యులు చికెన్ కొనాలంటే కాస్తా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేజీ చికెన్ ధర ఏకంగా రూ.300పైగా పలుకుతోంది. గత నెలలో రూ. 200గా ఉన్న కిలో చికెన్ ఇప్పుడు రూ.300 దాటింది.

Also Read: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి

ఎండ తీవ్రత ఎక్కువ కావడమే చికెన్ ధరలు పెరగటానికి కారణమంటున్నారు వ్యాపారస్తులు. గత రెండు నెలల నుంచి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండ వేడిమి కారణంగా ఫ్రౌల్టీలలోని కోళ్లు చనిపోతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే కోళ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడంతో మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.

Also Read: మంగళసూత్రం కొట్టేసిన ఘనుడు

దీంతో చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే చికెన్ ధర రూ. 300 దాటితే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని దిగులు చెందుతున్నారు. ముక్క లేనిదే ముద్ద దిగని ప్రియులు మాత్రం మరింత అవాక్కవుతున్నారు. ఇక చికెన్ కు బదులుగా వేరే దారి వెతుక్కొవాల్సిందేనని వాపోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు