/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kcr-2-jpg.webp)
KCR:కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భూకబ్జా కేసులో ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదిభట్ల పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమిని కన్నారావు గ్యాంగ్ కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. OSR ప్రాజెక్ట్ నిర్మాణాలు చేస్తుండగా కబ్జా చేసినట్లు సమాచారం. కన్నారావు తో పాటు మొత్తం 38 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగతా 28 మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg )
 Follow Us
 Follow Us