AP BRS: ఏపీలో కేసీఆర్ కు బిగ్ షాక్!

ఆంధ్ర ప్రదేశ్‌లో మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో ఆయన జనసేనలో చేరున్నారు. అలాగే.. ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు కూడా రాజీనామా చేయనున్నారు.

AP BRS: ఏపీలో కేసీఆర్ కు బిగ్ షాక్!
New Update

KCR: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని అనుకున్న కేసీఆర్ (KCR) ఆశలకు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) ఫలితాలు చెక్ పెట్టాయి. తాజాగా ఏపీలో (AP) మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది. ఏపీ బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ (Thota Chandrasekhar) తో పాటు రావెల కిశోర్‌బాబు (Ravela Kishore Babu) ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో తోట చంద్రశేఖర్‌ జనసేన పార్టీలో (Jana Sena) చేరనున్నారు. అలాగే.. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వైసీపీలో (YCP) చేరనున్నట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ (TRS) బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు. జనసేనకు గుడ్‌బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరారు తోట. తోటను పార్టీకి ప్రెసిడెంట్‌గా పెట్టినా ఏపీలో బీఆర్‌ఎస్‌ యాక్టివిటీ కనిపించలేదు. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ను వీడాలని ఇద్దరు నేతల నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan) కలవనున్నారు తోట చంద్రశేఖర్‌. జనసేన నుంచి గుంటూరు పశ్చిమ టికెట్‌ ను ఆశిస్తున్నారు తోట చంద్ర శేఖర్. మరి ఆయనకు జనసేన అడిగిన టికెట్ ఇస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. మరోవైపు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఈనెల 30న వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ: మరో 70 రోజుల్లో ఎన్నికలు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కూడా సేమ్..

పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) దగ్గర పడుతున్న వేళ మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ (BRS Leader) నేత సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేత తీగల కృష్ణారెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌ను సచివాలయంలో తీగల కృష్ణారెడ్డి కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. 

గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు తీగల కృష్ణారెడ్డి. గత శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన తీగల.. టికెట్ రాకపోవడంతో పార్టీపై అలిగినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే తీగల కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది. తాజాగా సీఎం రేవంత్‌ను కలవడంతో తీగల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: రేపు సా.4గంటలకు బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం

DO WATCH:

#ap-elections #brs-party #janasena #thota-chandrashekar #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe