Padmaja Venugopal: బీజేపీలోకి మాజీ సీఎం కూతురు

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేరళ మాజీ సీఎం కరుణాకరన్ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు పద్మజ వేణుగోపాల్ బీజేపీలో చేరారు. కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్నానని.. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

New Update
Padmaja Venugopal: బీజేపీలోకి మాజీ సీఎం కూతురు

Padmaja Venugopal: మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కేరళ మాజీ సీఎం కె.కరుణాకరన్ కుమారితి, కాంగ్రెస్ నాయకురాలు పద్మజ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఈరోజు బీజేపీలో చేరారు. గత కొన్ని రోజులుగా పార్టీలో అసంతృప్తి గా ఉన్న ఆమె ఈరోజు ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకున్నారు.

ALSO READ: మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు

నన్ను పట్టించుకోలేదు..

బీజేపీలో చేరిన పద్మజ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న తనకు బీజేపీలో చేరడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలపై కాంగ్రెస్ హైకమాండ్ ను ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. కేరళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విషయాలను చర్చించేందుకు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన వారు పక్కన పెట్టారని.. సోనియా గాంధీ అంటే తనకు అభిమానం అని.. కానీ పార్టీ కోసం కలిసి మాట్లాడేందుకు తనకు టైం కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

జేపీ నడ్డాతో భేటీ...

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన పద్మజ వేణుగోపాల్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆమెకు బీజేపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా. భారత దేశంలోని దక్షిణ రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పద్మజ వేణుగోపాల్ ను నిలబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ హామీతోనే ఆమె బీజేపీలో చేరారని ప్రచారం జోరందుకుంది. అయితే.. ఆమెకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు