Mallu Ravi: లోక్ సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌కు షాక్

లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ కోసమే మల్లు రవి తన పదవికి రాజీనామా చేశారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరందుకుంది.

Mallu Ravi: లోక్ సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌కు షాక్
New Update

Mallu Ravi: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి ఆయన రాజీనామా చేశారు. గత జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఎంపీ టికెట్ కోసమే మల్లు రవి తన పదవికి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జోరందుకుంది.

ఎంపీ టికెట్ పైనే ఆశలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ ను లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. సర్వేలు ఆధారంగా గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ హైకమాండ్ ఇస్తానని చెప్పిన తీసుకోకుండా లోక్ సభ సీట్ కోసమే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ కోసం ఆయన హైకమాండ్ ను పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆర్టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ లేదని.. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఒక్క టికెట్.. ఇద్దరు పోటీ..

ఎంపీ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేసి గెలిచి లోక్ సభలో తెలంగాణ గొంతు వినిపించాలని అని అనుకుంటున్నా మల్లు రవికి ఇప్పుడు ఆ సీటు తలనొప్పిగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయన పోటీ చేయాలనీ భావిస్తున్న అదే స్థానం నుంచి మరో బలమైన నేత పోటీ చేయాలనీ అనుకోవడమే. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంపత్‌ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. అయితే.. తనకే నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ కావాలని లేదంటే పార్టీకి రాజీనామా చేస్తానని మల్లు రవి హైకమాండ్ కు తెలిపినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఢిల్లీలోని తన పదవికి రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మల్లు రవిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరిలో అధిష్టానం ఎవరికీ టికెట్ ఇస్తుందో చూడాలి మరి.

#mallu-ravi #shock-for-cm-revanth #cm-revanth-reddy #bhatti-vikamarka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe