BRS Party: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

TG: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జగ్గారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు
New Update

Warangal BRS: బీఆర్ఎస్ పార్టీలో నేతల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జగ్గారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని అన్నారు. నాయకులు కలిసి పనిచేయాల్సిందే అని స్పష్టం చేశారు. కండిషన్‌తో చేరికలు ఉండవని అన్నారు. ఏఐసీసీ కంటే తోపులు ఇక్కడ ఎవరూ లేరు అని తేల్చి చెప్పారు. లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో కనిమెరుగు అవుతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మడం మానేశారని.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe