Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన అత్యంత అల్ప మెజారిటీ

లోక్‌సభ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజార్టీలు నమోదవ్వడం మామూలు విషయమే. కానీ ఈసారి అత్యల్ప మెజారిటీ కూడా నమోదయింది. మహారాష్ట్రలో శివసేన అభ్యర్ధి రవీంద్ర దత్తారాం వాయకర్ అత్యంత తక్కువ మెజారిటీతో గెలుపొందారు.

Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన అత్యంత అల్ప మెజారిటీ
New Update

Least Lead: మహారాష్ట్రలో ముంబై వాయువ్య నియోజకవర్గంలో శివసేన వర్సెస్ శివసేనల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే, ఏకనాథ్ షిండే నేతృత్వంలో పార్టీ నేతలు నెక్ టూ నెక్ తలపడ్డారు. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారనే విషయం తేలలేదు. చివరకు అతి తక్కువ ఓట్లతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్‌ తన సమీప ప్రత్యర్థి అమోల్‌ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి.

వీళ్ళిద్దరూ ఎంతలా పోటీ పడ్డారు అంటూ ఒకానొక స్టేజ్‌లో కేవలం ఒక ఓటుతో ఆధిక్యంలో కొనసాగారు. అమోల్ ఒక ఓటు ఆధిక్యంలో కొంతసేపు పాటూ ఉన్నారు. దీని తర్వాత కేరళలోని కేరళలోని అత్తింగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అదూర్‌ ప్రకాశ్‌ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించి రెండవ అత్యల్ప మెజారిటీ సాధించిన వ్యక్తిగా నిలిచారు.ఇక మూడవ స్థానంలో రాజస్తాన్‌లోని జైపూర్‌ రూరల్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్‌ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్‌ నాగ్‌ 1,884 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ రాజ్‌పుత్‌ 2,678 ఓట్ల తేడాతో నెగ్గారు.

Also read:Telangana: నేడు తెలంగాణలో మరో కౌంటింగ్!

#votes #eleactions-2024 #mejarity #sivasena-candidate
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe