అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు... పవార్ పై శివసేన ఫైర్...!

author-image
By G Ramu
అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు... పవార్ పై శివసేన ఫైర్...!
New Update

‘లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు’ప్రదాన కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి శరద్ పవార్ వేదికను పంచుకోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ‘మౌత్ పీస్’సామ్నాలో పవార్ పై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ నియంతృత్వ విధానాలను వ్యతిరేకించేందుకు గాను ఆ కార్యక్రమానికి పవార్ దూరంగా వుండి వుంటే పవార్ ను మహా ప్రజలు ప్రశంసించేవారని పేర్కొంది.

లోక్ మాన్య తిలక్ కొటేషన్ ను ప్రస్తావిస్తూ పవార్ పై మండిపడింది. ప్రజా నాయకుడు కావాలంటే అతను స్వార్ధాన్ని విడిచి పెట్టాలని తిలక్ అన్నాడని తెలిపింది. ప్రజా నాయకుడు కావాలంటే అతని ప్రవర్తన కూడా ఆదర్శంగా వుండాలని రాసుకొచ్చింది. దేశం ‘రెండవ స్వాతంత్ర్య ఉద్యమంగా అభివర్ణించే పోరాటంలో ఉన్న సమయంలో పవార్ వంటి నాయకునిపై ప్రజలకు భిన్నమైన అంచనాలు వున్నాయని సామ్నా ఎడిటర్ పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఎన్సీపీపై మోడీ అవినీతి ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆ పార్టీని రెండుగా చీల్చారన్నారు. ఆ పార్టీకి మహా సర్కార్ లో చోటు కల్పించారన్నారు. అందుకే మోడీ కార్యక్రమానికి హాజరు కావాలనుని పవార్ తీసుకున్న నిర్ణయంపై ఎన్సీపీలోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిరించారని చెప్పారు.

ప్రధాని మోడీతో వేదిక పంచుకోవాలని పవార్ తీసుకున్న నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాయన్నారు. ప్రధాని మోడీ లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డును ఈ నెల 1న అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా శరద పవార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పవార్ కు ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

#shiv-sena #pm-narendra-modi #sharad-pawar #saamana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe