ShivSena: తెలంగాణ అసెంబ్లీ బరిలో శివసేన ..!! ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శివసేన నిర్ణయించుకున్నట్లు ఆపార్టీ తెలంగాణ యూనియన్ అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ నియోజకవర్గాలపై తాము దృష్టి సారించినట్లు వివరించారు. By Bhoomi 16 Aug 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై శివసేన (ShivSena) ఫోకస్ పెట్టింది. తెలంగాణలో (Telangana Assembly Elections)పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మధ్యకాలంలో ప్రాంతీయపార్టీలు విస్తరణపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ మహారాష్ట్రలో విస్తరణ వేగవంతం చేస్తోంది. ఈ తరుణంలోనే మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. త్వరలోనే జరుగున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగానే బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు. ముంబైలో రెండు రోజుల క్రితం పార్టీ సెంట్రల్ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్ తో సింకారు శివాజీ సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన కీలక విషయాలపై చర్చించారు. మహారాష్ట్రకు భౌగోళిక సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతాల నియోజవర్గాల శివసేన ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ మేరకే తామ పార్టీ హైకమాండ్ ఆదేశించిందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఓం రహస్య మిత్రపార్టీలని ఈ పార్టీలకు శివసేన సత్తా ఏంటో చూపిస్తామన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో శివసేన అధ్యక్షుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) మాట్లాడతారని తెలిపారు. #telangana-assembly-elections #eknath-shinde-faction #maharashtra-party #shinde #shivsena-party #shivsena-party-in-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి