నౌకలో అగ్నిప్రమాదం..కాలి బూడిదైన 3000 కార్లు!

సముద్రంలో కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగడంతో సుమారు 3000 కార్ల బుగ్గి అయ్యాయి. జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరిన ఓ భారీ రవాణా నౌకలో ఒక్కాసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన నౌకలోని వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు.

New Update

ship carrying 3000 cars catches fire off dutch coast

దట్టంగా పొగలు కమ్ముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన వారు ప్రాణాలను రక్షించుకునేందుకు సముద్రంలోనికి దూకేశారు. ఈ ప్రమాదం నౌకలో ఉన్న ఎలక్ట్రిక్‌ కార్ల వల్లే జరిగి ఉండవచ్చని నౌక యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నౌకకు అంటుకున్న మంటలు ఇప్పట్లో అదుపులోనికి వచ్చే అవకాశాలు లేవని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.

మంటలను అదుపు చేసేందుకు ఎక్కువ నీటిని నౌక మీద కానీ స్ప్రే చేస్తే ఓడ మునిగిపోయే ప్రమాదం ఉన్నందున నీటికి కేవలం పక్కల మాత్రమే చల్లుతున్నట్లు అధికారులు వివరించారు. సముద్రంలో దూకిన 23 సిబ్బందిని కూడా అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న హెలికాఫ్టర్‌ బృందం వారిని రక్షించింది.

వారంతా శ్వాసతీసుకోవడంలో సమస్యలు ఎదుర్కోవడంతోపాటు కాలిన గాయాలు, ఎముకలు విరిగి బాధపడుతున్నట్టు డచ్ అధికారులు తెలిపారు. వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు