Sherlyn Chopra Shocking Comments On RGV : సినీ ఇండస్ట్రీలో బోల్డ్ అండ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అతికొద్ది మందిలో హైదరాబాదీ బ్యూటీ షెర్లిన్ చోప్రా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయింది.
ప్రస్తుతం పలు మూవీ ఆఫర్స్ ని అందుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెర్లిన్ చోప్రా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై సంచలన కామెంట్స్ చేసింది.
Also Read : రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ మూవీ!
ఆఫర్ అడిగితే ఆ వీడియో పంపించాడు
ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షెర్లిన్ చోప్రా క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనుభాలను గుర్తు చేసుకుంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది." డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనే నాకు చాలా ఇష్టం. ఆయన తన సినిమాల్లో హీరోయిన్స్ ని చాలా బాగా చూపిస్తాడు.
2016 లో ఆయనకు వాట్సాప్ లో నా ఫోటోలు, వివరాలు పంపి మీ సినిమాలో ఏదైనా అఫర్ ఉంటే ఇవ్వమని అడిగాను. నా మెసేజ్ కి ఆయన రిప్లై ఇస్తూ.. 'ఓ స్క్రిప్టు పంపిస్తున్నా. ఇది చదవి చెప్పు. నచ్చితే వెంటనే సినిమా చేద్దాం' అని అన్నాడు. ఆ స్క్రిప్ట్ చదివితే అందులో సెక్స్ సీన్స్ తప్ప ఏమీ లేదు.
ఇదే విషయం పై ఆయన్ని అడిగితె, 'నచ్చితే చెయ్ లేకుంటే లేదు' అని అన్నాడు. ఆ తర్వాత వర్మ నాకో వీడియో పంపాడు. అందులో సెక్స్ సీన్స్ ఉన్నాయి. అది చూసి నేను షాకయ్యా. కోపంతో వెంటనే ఈ వీడియో నాకెందుకు పంపారు అని అడిగితే, అయన అది ఓ సాధారణ విషయం అన్నట్లుగా మాట్లాడాడు. కానీ ఆ తర్వాత నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు" అని చెప్పుకొచ్చింది.