Shehbaz Sharif As Pakistan Prime Minister: పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాక్ PML-N-PP కూటమికి చెందిన అభ్యర్థిగా ఆయననే ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకున్నారు. దీంతో షెహబాజ్ వరుసగా రెండోసారి పాక్ ప్రధానికిగా బాధ్యతులు చేపట్టనున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరవాత దాదాపు 16 నెలల పాటు పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ అవే బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో పార్లమెంట్‌ని రద్దు కాగా గత నెలలో పాకిస్థాన్ లో ఎన్నికలు జరిగాయి. కూటమిలోని పార్టీలు షెహబాజ్‌కే మరోసారి ప్రధాని బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించడంతో ఆయన ఎన్నిక ఖరారైంది.
ఇది కూడా చదవండి : Madhavi Latha : ఒవైసీ కంచుకోటలో హిందుత్వ ముఖం గెలుస్తుందా? ఎవరీ మాధవి లత?
ప్రధానిగా 16 నెలలు..
ఇదిలావుంటే.. బలూచిస్థాన్ ప్రావిన్సు ముఖ్యమంత్రిగా పీపీపీ అభ్యర్థి సర్ఫరాజ్ బగ్టీ (Sarfraz Bugti) శనివారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇక పిఎంఎల్ ఎన్ అధ్యక్షుడైన షెహబాజ్ షరీఫ్ (72) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (74) సోదరుడు. షెహబాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేగంగా భారీ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేశారన్న మంచి సమర్ధుడిగా గుర్తింపు పొందారు. అయితే 2022లో ప్రధానిగా 16 నెలలు బాధ్యతలు నెరవేర్చినప్పుడు తన సమర్థతను అంతగా చూపించలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి.