Sheep Distribution Scam: బీఆర్ఎస్‌కు షాక్.. ఈడీ దూకుడు

గొర్రెల పంపిణీ స్కీమ్‌లో జరిగిన అవకతవకలపై ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది.

New Update
Sheep Distribution Scam: బీఆర్ఎస్‌కు షాక్.. ఈడీ దూకుడు

Sheep Distribution Scam: బీఆర్ఎస్‌కు గొర్రెల స్కామ్ ఉచ్చు బిగుస్తోంది. గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగిందనే ఆరోపణలపై రంగంలోకి ఈడీ దిగింది. పశుసంవర్ధకశాఖ ఆఫీసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసింది ఏసీబీ. ఏసీబీ విచారణపై ఈడీ ఆరా తీస్తోంది. అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది.

గత ప్రభుత్వం హయంలో పశుసంవర్ధక మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ. 700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే తలసాని OSD అరెస్ట్‌ చేసింది.

రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..

మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ (ED) కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. గొర్రెల స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డికి ముందుంది ముసళ్ళ పండుగ అని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు