Viral Video: ఇంత తింగరి గొర్రె ఏంట్రా బాబూ.. నమ్మించి కుమ్మేసింది.. వీడియో చూస్తే నవ్వాగదు..

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ఎందుకంటే.. ఆ రేంజ్‌లో కామెడీ ఉంది మరి. ఓ వ్యక్తి సరదాగా తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అతని దారికి ఓ మూడు గొర్రెలు అడ్డొచ్చాయి.

Viral Video: ఇంత తింగరి గొర్రె ఏంట్రా బాబూ.. నమ్మించి కుమ్మేసింది.. వీడియో చూస్తే నవ్వాగదు..
New Update

Viral Video: మన జీవితంలో నిత్యం జరిగే కొన్ని సంఘటనలు చూస్తూనే ఉంటాం. కొందరు చిన్న పిల్లలు తింగరి పనులు చేస్తుంటారు. వారి అల్లరి కాస్త ఇబ్బంది పెట్టినా.. అలరిస్తుంటుంటి. అయితే, మనుషులే కాదు.. కొన్ని జంతువులు కూడా అల్లరి చేస్తుంటాయి. చాలా మంది పెంపుడు జంతువులు పెంచుకుంటారు. వాటితో సరదాగా సమయం గడుపుతారు. కుక్కలు, పిల్లులతో పాటు.. మరికొన్ని జంతువులను కూడా పెంచుకుంటారు. మరికొందరు.. గొర్రెలు, పొట్టేళ్లు, మేకలను కూడా పెంచుకుంటారు. ఇక అవి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలాంటి రచ్చకు సంబంధించిన వీడియోనే నెటిజన్లు ఖుషీ చేస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ఎందుకంటే.. ఆ రేంజ్‌లో కామెడీ ఉంది మరి. ఓ వ్యక్తి సరదాగా తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అతని దారికి ఓ మూడు గొర్రెలు అడ్డొచ్చాయి. తన దారికి అడ్డొచ్చిన గొర్రెలను పక్కకు అదిలిచ్చాడు. అవి కూడా అతనికి భయపడినట్లుగా పక్కకు జరిగాయి. దాంతో అతను తన దారిలో తాను హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే, తింగరి గొర్రెలు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగాయి. వీటిలో రెండు సైలెంట్‌గా ఉండగా.. ఒకటి మాత్రం ఆ వ్యక్తినే ఫాలో అయ్యింది. అతన్ని ఢీకొట్టేందుకు ట్రై చేసింది. భయపడుతూనే చివరకు తన కొమ్ములతో కుమ్మేసింది. గొర్రె దెబ్బకు దిమ్మతిరిగిపోయి అతను కింద పడిపోయాడు. ఆ గొర్రెలు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా అక్కడి నుంచి పరార్ అయ్యాయి.

ఈ సీన్ అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్ పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. తింగరి గొర్రెలు ఉన్నాయేంట్రా బాబూ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వీడియోను రీట్వీట్ చేస్తూ వీడియోపై తమ ఆసక్తిని కనబరుస్తున్నారు నెటిజన్లు.

Also Read:

Telling Lies: పదేపదే అబద్ధాలు చెప్పేవారిని ఎలా డీల్ చేయాలి? ఈ టిప్స్ పాటించండి..!

Mental Health: నిద్ర లేదా ఆహారపు అలవాట్లు మారాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe