America: అమెరికాలో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ రికార్డు!

అగ్ర రాజ్యం లో  తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా జయ బాదిగ అరుదైన గౌరవం పొందారు.

New Update
America: అమెరికాలో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ రికార్డు!

Jaya Badiga becomes first judge in California from Telugu States: గత కొంతకాలంగా తెలుగు వారు విదేశాల్లో తమ సత్తాను చాటుతున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్‌ ప్రధానిగా ఉండగా..అగ్రరాజ్యంలో అధికార కేబినెట్‌ లో దాదాపు భారత మూలాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమలోనే తాజాగా అగ్ర రాజ్యం లో  తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది.

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు (Vijayawada) చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. ఈమె 2022 నుంచి కోర్టు కమిషనర్‌గా వ్యవహరించారు. తాజాగా శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా (Supreme Court Judge) నియమితులయ్యారు. దీని ద్వారా కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా జయ బాదిగ అరుదైన గౌరవం పొందారు. కోర్టు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఫ్యామిలీ లాలో జయ నిపుణురాలు. అలాగే టీచర్‌గానూ, మెంటార్‌గానూ వ్యవహరించారు. ఈమెకు బాధ్యత రావడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.

Also Read: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు!

కాగా.. జయ బాదిగ విజయవాడలో జన్మించారు. హైదరాబాద్ లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1991 నుంచి 1994 వరకూ ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ చేశారు. అనంతరం ఆమె అమెరికా వెళ్లారు. ఆ తర్వాత శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో జూరిస్ డాక్టర్ పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ పూర్తి చేసుకున్నారు. 10 ఏళ్లకు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొన‌సాగించారు.

ఆమె 2022 నుంచి శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్‌గా వ్యవహరించారు. అయితే శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జి రాబర్ట్ లాఫమ్ పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో జడ్జిగా జయ బాదిగ సుపీరియర్‌ జడ్జిగా నియమితులయ్యారు.

Advertisment
తాజా కథనాలు