YS Sharmila: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై షర్మిల సెటైరికల్ ట్వీట్

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు గుప్పించారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం నిధులపై స్పష్టత ఇచ్చారా? అని నిలదీశారు.

YS Sharmila: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై షర్మిల సెటైరికల్ ట్వీట్
New Update

YS Sharmila: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అని చురకలు అంటించారు. ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు... ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు? అని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు ? అని నిలదీశారు.

షర్మిల ట్విట్టర్ (X)లో.. "అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు. NDA కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు... ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు ? కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ, ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారు? గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా ? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా ? పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత ఇచ్చారా ? రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా ?

“ఒడ్డు దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాట‌క బోడి మ‌ల్ల‌న్న “. ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచింది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది." అంటూ రాసుకొచ్చారు.

publive-image చంద్రబాబుపై షర్మిల చేసిన ట్వీట్

#sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe