YS Sharmila: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అని చురకలు అంటించారు. ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు… ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు? అని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు ? అని నిలదీశారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై షర్మిల సెటైరికల్ ట్వీట్
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు గుప్పించారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం నిధులపై స్పష్టత ఇచ్చారా? అని నిలదీశారు.
Translate this News: